Friday, November 22, 2024

TG – హైద‌రాబాద్ లో ఘ‌నంగా మొహ‌ర్రం వేడుక‌లు

బిబీ కా ఆలం నుంచి ప్రారంభ‌మైన అంబారీ ఊరేగింపు
పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న ముస్లీంలు
రాత్రి వ‌ర‌కు సాగ‌నున్న ఊరేగింపు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – త్యాగానికి, స్ఫూర్తికి ప్రతీకగా నిలచిన మొహర్రం పర్వదినం సందర్భంగా పాతబస్తీలోని బీబీ-కా-ఆలం నుంచి ఊరేగింపు నేటి మధ్యాహ్నం ప్రారంభమైంది . మొహర్రం సంతాప దినంలో భాగంగా అంబారీపై బయలుదేరిన ఊరేగింపు చార్మినార్ మీదుగా సాగి రాత్రికి చాదర్ ఘాట్ వద్ద ముగియనుంది . ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో షియా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. చార్మినార్ వద్ద బీబీ-కా-ఆలం చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఊరేగింపు డబీర్‌పురాలోని బీబీ-కా-ఆలం నుండి ప్రారంభమై, అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్‌హౌజ్, పంజేషా, మీరాలం మండి, దారుల్ షిఫా మీదుగా సాగి చాదర్‌ఘాట్ వద్ద ముగుస్తుంది.

- Advertisement -

రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు..
మరోవైపు బీబీకా ఆలం ఊరేగింపు నేపథ్యంలో పాతబస్తీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement