Friday, November 22, 2024

పదో తరగతి పరీక్షలను రద్దు – గ్రేడింగ్ ఆధారంగా ప్రమోట్

హైదరాబాద్ – తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. అలాగే ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.కాగా, రాష్ట్రంలో దాదాపు 5.35 లక్షల మంది పదో తరగతి విద్యార్ధులు ఉండగా.. వీరందరినీ కూడా గ్రేడింగ్ ఆధారం పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ సీఎం కేసీఆర్‌కు పంపగా.. ఆ ఫైల్‌పై ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. కాగా, ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విద్యాసంస్థలను మూసివేసిన సంగతి విదితమే. అటు ఇంటర్ ప్రాక్టికల్స్‌ మే 29 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇంటర్ పరీక్షల నిర్వహణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement