హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న పన్ను ఎగవేత దారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్ట వద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికు మారి రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొండి బకాయల వసూళ్ళతో పాటు ఎగవేత దారులను గుర్తించి గట్టి ప్రయత్నం చేస్తే ఆర్థికంగా ప్రభుత్వానికి మేలు జరుగుతుందన్నారు. 2022-23 సంవత్సరానికి గానూ అసాధారణ పనితీరు కనబర్చినందుకు వాణిజ్య పన్నుల శాఖ అధి కారులను సీఎస్ అభినందించారు. ఎగవేతపై దృష్టి సారించడం ద్వారా ఈ ఏడాది రూ. 85,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించేందు కు తమ ప్రయత్నాలను విస్తరించాలని ఆమె అధికారులను కోరారు. ఈ సందర్భంగా సచివాలయంలో వాణిజ్య పన్నుల శాఖలోని సీనియర్ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి, అదనపు వనరులను పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆదాయాన్ని పెంచేందుకు వినూత్న సూచనలతో ముందుకు వచ్చిన శాఖ ఉన్నతాధికారులను ఆమె అభినందించారు. అపిలేట్ జాయింట్ కమీషనర్ల వద్ద పెండింగ్ లో ఉన్న కేసులను ప్రతి 15 రోజులకోసారి సమీక్షించాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఆదాయం ఎక్కువగా సమకూరే ప్రాంతాలను మ్యాప్ చేసి, క్రమపద్ధతిలో ముందుకు సాగా లని సీఎస్ అధికారులకు సూచించారు. ఆదా యాన్ని పెంపొందించేందుకు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పలు సూచనలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను బలోపేతం చేయ డం, స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ సమావేశం లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, అదనపు కమిషనర్లు సాయి కిషోర్, హరిత, జాయింట్ కమిషనర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement