Tuesday, November 19, 2024

పేద విద్యార్థి కి గవర్నర్ లాప్ టాప్ సాయం

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో తన ఉన్నత చదువులకు ల్యాప్‌టాప్‌ అవసరమని సోషల్‌ మీడియాలో సాయం కోరిన డిఫార్మసీ విద్యార్ధికి తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. సదరు విద్యార్ధికి గవర్నర్‌ నిధి నుంచి కొనుగోలుచేసిన ల్యాప్‌టాప్‌ను విద్యార్ధికి అందజేశారు. విషయానికి వస్తే రంగారెడ్డిజిల్లా చేగూర్‌గ్రామానికిచెందిన విద్యార్ధి బి. ప్రమోద్‌ డిఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కరోనా నేపధ్యంలో ప్రస్తుతం చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ద్వారానే క్లాసులు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. అయితే తనకు ల్యాప్‌టాప్‌ లేక పోవడం వల్ల ఆన్‌లైన్‌ క్లాసులను అటెండ్‌కాలేకపోతున్నాని, తనకు ల్యాప్‌టాప్‌ సాయం చేయాలంటూ సోషల్‌ మీడియాలో విజ్ఞప్తిచేశారు. దీనికి స్పందించిన గవర్నర్‌ తమిళిసై ఆ విద్యార్ధిని రాజ్‌భవన్‌కు పిలిపించి ల్యాప్‌టాప్‌ను అందజేశారు.ఈసందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న విద్యార్ధి తను ఎంచుకున్న రంగంలో మరింత ముందుకు పోయి మంచి ఫలితాలుసాధించాలని అన్నారు. నువ్వుకూడా ఎంచుకున్నరంగంలో రాణిస్తూ పేదలకు  సహాయం చేయాలని కోరారు. సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలని సూచించారు. తాను ఓ చిన్నరైతు కుటుంబానికిచెందిన వాడినని, తనకు ల్యాప్‌టాప్‌కొనే స్థోమత లేదని విద్యార్ధి ప్రమోద్‌ ఈసందర్భగా తెలిపారు. గవర్నర్‌ మేడం ఎంతో దయతలచి తనకు చేసిన సాయం మరువలేనని చెప్పారు. అలాగే భవిష్యత్‌లో తానూ సేవాదృక్పధంతో జీవిస్తానని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement