Saturday, November 23, 2024

షెడ్యూల్ ప్ర‌కారమే కార్పొరేష‌న్, మునిసిపాలిటీల ఎన్నిక‌లు…

హైద‌రాబాద్ – తెలంగాణ‌లోని రెండు కార్పొరేష‌న్, అయిదు మునిసిపాలిటీల‌కు షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌ల నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి దృష్ట్యా ఇప్ప‌టికే రాష్ట్రంలో రాత్రి పూట క‌ర్ఫ్యూ అమ‌లు అవుతున్న‌ది.. అదే విధంగా ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు..అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ప్ర‌జ‌ల‌ను ఇళ్ల నుంచి ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ప్ర‌భుత్వం ఒకింతా ఘాటుగానే హెచ్చ‌రించింది.. స‌భ‌లు,స‌మావేశాలు, మాస్ గేద‌రింగ్ పై క‌ఠిన‌ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.. ఈ ద‌శ‌లో ఎన్నిక‌ల జ‌రిగే ప్రాంతాల‌లో ప్ర‌చారానికి ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి… ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల‌ను నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ హైకోర్టులో కాంగ్రెస్ వేసిన పిల్ పై తీర్పు ఇస్తూ తామ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో జోక్యం చేసుకోలేమ‌ని తేల్చి చెప్పింది.. అయితే ఈ విష‌యంలో పిటిష‌న‌ర్ ను ఎన్నిక‌ల క‌మిష‌న్ ను ఆశ్ర‌యించ‌వ‌చ్చ‌ని కోరింది.. ఈ నేప‌థ్యంలో ప‌లు పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ ఎన్నిక‌ల క‌మిష‌న్ ను కోరాయి.. వాటిని ప‌రిశీలించిన ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎన్నిక‌ల నిలుపుద‌ల పై ప్ర‌భుత్వ అభిప్రాయాన్ని కోరుతూ సిఎస్ కు లేఖ రాసింది.. దీనిపై నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం యథావిధిగానే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ను కోరింది.. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప్ర‌చారాన్ని నిర్వ‌హించాల‌ని అన్ని పార్టీల‌కు ఎన్నిక‌ల సంఘం సూచించింది.. అలాగే ప్ర‌చారంలో అయిదుగురు మించి పాల్గొన‌కూడ‌ద‌ని ఆంక్ష‌లు విధించింది.. సాయంత్రం ఆరు గంట‌ల‌కే ప్ర‌చారాల‌ను ముగించాల‌ని కోరింది.. బ‌హిరంగ స‌భ‌లు, రోడ్ల కూడ‌ళ్ల‌లో ప్ర‌చారాలు నిషేధించింది… కాగా, ఇప్ప‌టికే ప్రారంభ‌మైన ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో రేప‌టితో నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గడువు ముగియ‌నుంది.. ఈ నెల 30వ తేదిన పోలింగ్ జ‌ర‌గ‌నుంది.. మే మూడో తేదిన కౌంటింగ్ చేప‌ట్టి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement