హైదరాబాద్ – తెలంగాణలోని రెండు కార్పొరేషన్, అయిదు మునిసిపాలిటీలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియకు బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి దృష్ట్యా ఇప్పటికే రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ అమలు అవుతున్నది.. అదే విధంగా ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు..అత్యవసరమైతే తప్ప ప్రజలను ఇళ్ల నుంచి ప్రజలను బయటకు రావద్దని ప్రభుత్వం ఒకింతా ఘాటుగానే హెచ్చరించింది.. సభలు,సమావేశాలు, మాస్ గేదరింగ్ పై కఠిణ ఆంక్షలు కొనసాగుతున్నాయి.. ఈ దశలో ఎన్నికల జరిగే ప్రాంతాలలో ప్రచారానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి… ఇదే సమయంలో ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టులో కాంగ్రెస్ వేసిన పిల్ పై తీర్పు ఇస్తూ తామ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.. అయితే ఈ విషయంలో పిటిషనర్ ను ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించవచ్చని కోరింది.. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ ను కోరాయి.. వాటిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఎన్నికల నిలుపుదలకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.. దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరుతూ సిఎస్ కు లేఖ రాసింది.. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది.. ప్రస్తుతం కెసిఆర్ కరోనాతో ఫామ్ హౌజ్ లో చికిత్స పొందుతున్నారు.. అధికారులు ఎన్నికల కమిషన్ చేసిన సూచనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. దీనిపై కెసిఆర్ నిర్ణయం కోసం అధికారులు వేచి చూస్తున్నారు.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ ఇవ్వాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే ఎన్నికల నిలుపుదల చేస్తూ ప్రకటన వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని అధికారులు అంటున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement