Friday, November 22, 2024

రూ. రెండు వేల కోట్ల‌తో బ‌డుల్లో సౌక‌ర్యాలు…

హైదరాబాద్‌, : తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలోని మౌలికవసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దేందుకు చర్యలు వేగవంతం చేసింది. ప్రభుత్వ స్కూళ్లలోని వసతులు, సౌక ర్యాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై వివరాలు సేకరించింది. దీని కోసం కొన్ని ప్రశ్నలతో కూడిన ప్రత్యేక ఒక ప్రొఫార్మాను తయారు చేసి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఇప్పటికే పంపించారు. అయితే వీటికి సంబంధించిన వివరాలు నివేదించడానికి బుధవారం వరకు డెడ్‌లైన్‌ పెట్టడంతో ఆయా స్కూళ్ల వారిగా తమ పాఠశాల్లోని మౌలిక వసతుల వివరాలు పాఠశాల విద్యా డైరెక్టర్‌కు సమర్పించినట్లు తెలి సింది. దాదాపు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సంబంధించిన వివరాలు అందినట్లు తెలిసింది.
రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ, లోకల్‌ బాడి స్కూళ్లున్నాయి. వీటిలో దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. అయితే స్కూళ్లలో బాలురకు, బాలికలకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? టాయ్‌లెట్లు వేర్వేరుగా ఉన్నాయా? అసలు ఎన్ని ఉన్నాయి? ఇంకా కావాలా? తరగతి గదులు, మంచినీటి సమస్యలు, పాఠశాలలకు ప్రహరీ గోడ, శిథిలావస్తలో భవనాలు ఎన్ని ఉన్నాయి? కొత్తవి ఎన్ని కావాలి? తది తర లాంటి 50 అంశాలతో కూడిన వివరాలు సేకరించారు. మార్చి 31 కల్లా వీటన్నింటికి సంబంధించిన వివరాలు పాఠశాల విద్యాశాఖ డైరె క్టర్‌కు పంపించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదే శాలు జారీ చేయడంతో ఆ వివరాలన్నింటిని డైరెక్టర్‌కు నివేదించినట్లు తెలిసింది. ఇంకా వివరాలు ఇవ్వని పాఠశాలలు ఏమైనా ఉంటే ఒకటి రెండు రోజుల్లో సమర్పించాలని సూచించినట్లు తెలిసింది.
ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి పోటీని తట్టుకుని ప్రభుత్వ విద్యా రంగం నిలబడాలంటే మొదట సర్కారు స్కూళ్లలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మౌలిక అవసరాలను తీర్చాలని ప్రభుత్వ భావిం చింది. ఇందులో భాగంగానే రూ.4 వేల కోట్లతో నూతన విద్యా పథ కాన్ని తీసుకొచ్చారు. ఏడాదికి రూ.2 వేల కోట్ల నిధులు ఈ పథకం కింద ఖర్చు చేసి స్కూళ్లను అభివృద్ధి చేయనున్నారు. అయితే రాష్ట్రం లోని పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మౌలిక వసతులు ఉన్నాయా? లేదా? అని తెలుసుకున్నాక విధివిధానాలు రూపొందిం చాలని మంత్రులు సబితా, కేటీఆర్‌, హరీష్‌ రావు, దయాకర్‌రావులతో కూడిన మంత్రుల సబ్‌ కమిటీ ఇటీవల నిర్ణయించింది. అన్ని పాఠశాలల వివరాలు వచ్చి ఉండడంతో ఇక త్వరలోనే ఈ మంత్రుల సబ్‌ కమిటీ సమావేశమై స్కూళ్ల అభివృద్ధిపై ప్రణాళికలు రచించను న్నారు. వచ్చే విద్యా సంవత్సరానకి రూ.2 వేల కోట్లతో మౌలిక వస తుల కల్పనకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఖర్చు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement