హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. 859 పెట్రోలింగ్ వాహనాలు, 1,523 ద్విచక్ర వాహనాలపై సిబ్బంది నిబంధనలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు జరిగిన విచారణకు డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కట్టడికి పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలను డిజిపి కోర్టుకు విన్నవించారు. ఆసుపత్రుల వద్ద పోలీసుల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. భౌతికదూరం పాటించని సంస్థలపైనే కేసులు నమోదు చేస్తున్నామని, వ్యక్తులపై నమోదు చేయడం లేదని పేర్కొన్నారు. ఔషధాల అక్రమ విక్రయాలకు సంబంధించి 39 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement