హైదరాబాద్, : వరస ఎన్నికల్లో ఓటమిపాలవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ మినీ పురపోరు సవాల్‌గా మారింది. ఈ ఎన్నికల్లో కాస్త పరువు దక్కించుకోవాలనే ఆలోచనతో హస్తం పార్టీ ముందుకు సాగుతోది. అభ్యర్థుల ఎంపిక నుంచి కలిసొచ్చే పార్టీలతో పొత్తులు తదితర అంశాలపైన స్థానిక నాయకత్వానికి పీసీసీ పూర్తి స్వేచ్చ నిచ్చింది. అభ్యర్థుల తరపున ప్రచారం కూడా ఆయా జిల్లా నాయకులకే అప్పచెప్పారు. ప్రధానంగా వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్న కాంగ్రెస్.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ రెండు కార్పోరేషన్లకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల కమిటిలు నియ మించారు. ఈ కమిటిలే స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇతర పార్టీలకు చెంది న బలాబలాలు, సామాజిక సమీకరణాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. మిగతా మునిసిపాలిటిల్లో కూడా స్థానిక నాయక త్వంపైనే పీసీసీ భారం వేసింది. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత వారికే అ ప్పచెప్పారు. ఈ రెండు కార్పోరేషన్లు, మిగతా ఐదు మునిసిపాలిటిల్లో పోటి చేసే అభ్యర్థులకు సంబంధించిన బీ-ఫారాలను మాత్రం అభ్యర్థులకు ఇవ్వకుండా .. నేరుగా 22న ఎన్నికల రిటర్నింగ్ అధికారులకే పీసీసీ పరిశీలకుడి ద్వారా డీసీసీ లేదా నగర కాం గ్రెస్ అధ్యక్షుల ద్వారా అందజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అధికార టీఆర్‌ఎస్ నుంచి వచ్చే ముప్పును తట్టుకోవాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరి స్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత అభిప్రాయపడ్డారు. ఎం దుకంటే నామినేషన్ల వేసిన కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరించి, లేదంటే డబ్బుల ఆశ చూపి చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరింపచేసే కుట్రలు జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం వరంగల్ కార్పోరేషన్ కాంగ్రెస్ సమావేశంలో పార్టీకి నమ్మక ద్రోహం చేయవద్దు అని మాజీ మంత్రి కొండా సురేఖ కూడా చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే పనిలో ఆ పార్టీ నేతల నిమగ్నమయ్యారు. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌లోని నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement