ఏరువాక తర్వాత తెలంగాణలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఎలాంటి రోగాలు, మహమ్మారులు రాకుండా కాపాడాలని వేడుకుంటూ బోనాల పండుగ నిర్వహించడం ఆనవాయితీ. అయితే కరోనా కారణంగా గతేడాది బోనాలు పెద్దగా తీయలేదు. ఈసారి సెకండ్ వేవ్ వచ్చి ఇప్పడిపుడే తగ్గుముఖం పడుతోంది. ఈ సమయంలో బోనాలను ఎలా నిర్వహించాలి అనే అంశంపై శుక్రవారం నాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే…బోనాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జులై 11న గోల్కొండ మహంకాళి అమ్మవారికి తొలి బోనం ఉంటుందని, జులై 25న సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు, 26న రంగం ఉంటుందని అన్నారు. ఇక, ఆగస్టులో లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఉంటాయని అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు మంత్రి శ్రీనివాస్ యాదవ్.