Friday, November 22, 2024

డ్ర‌గ్స్ కేసులో ఎమ్మెల్యేలు..

ప్రచారంలో నిజామాబాద్‌, రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ నేతల పేర్లు
పారిశ్రామిక వేత్త సందీప్‌రెడ్డి, యువ నటుడు తనీష్‌ను విచారించిన బెంగళూరు పోలీసులు
నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నవెూదు
ఎమ్మెల్యేలకూ త్వరలో నోటీసులు
దశలవారీగా విచారించే అవకాశం
ఎవరెవరికి సంబంధాలన్న అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ

హైదరాబాద్‌, బెంగళూరు డ్రగ్స్‌ కేసు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. డ్రగ్స్‌ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారని, లేదు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. బెంగళూరు పోలీసులు ఇంకా అధికారికంగా ఈ విషయాలు ప్రకటించలేదు. ఇంకా తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరికీ నోటీసులు అందకపోగా, ఈ వారంలో నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. నిందితుడు సందీప్‌రెడ్డి, యువనటుడు తనీష్‌లను విచారించిన బెంగళూరు పోలీసులు వీరి వాంగ్మూలం ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సమాచారం. హైదరాబా ద్‌కు చెందిన ఈవెంట్‌ మేనేజర్‌ కలహరరెడ్డి, పారి శ్రామికవేత్త సందీప్‌రెడ్డిని బెంగళూరు శివారులోని నిర్మాత శంకర్‌ గౌడ్‌ ఇచ్చిన పార్టీకి తీసుకెళ్ళగా, ఈ పార్టీకి ప్రముఖులు హాజరైనట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఒక యువ ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీలో డ్రగ్స్‌ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో తెలుగు సినీపరిశ్రమకు చెందిన ముగ్గురు ప్రముఖులు కూడా ఉన్నట్లు ప్రచారం ఉంది. ఇప్పటికే హీరో తనీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిం చారు. డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎవరు? ఇదే పార్టీలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారా? ఓ ఎమ్మెల్యే కొకైన్‌ తీసుకెళ్ళి మరోచోట పార్టీ నిర్వహించాడా? మొత్తం నలుగురు ప్రజాప్రతినిధులా.. ఎనిమిది మం దా? అంతా తెలంగాణ వారేనా? ఏపీకి సంబంధించిన వారె వరై నా ఉన్నారా? అంటూ విస్తృత చర్చ జరుగుతోంది.
ఎవరా నేతలు?
కొందరు ఈవెంట్‌ మేనేజర్లు, పారిశ్రా మిక వేత్తలతో పాటు ముగ్గురు సినీ ప్రముఖులు, పలువురు ఎమ్మెల్యేలు 2019లో బెంగళూరులో జరిగిన డ్రగ్స్‌ పార్టీకి హాజరుకాగా, ఇక్కడ ఓ డ్యాన్సర్‌తో కలిసి పలువురు డ్యాన్స్‌ కూడా చేసినట్లు బెంగళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. తొలుత వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు బయటకు రాగా, తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు, మహబూబ్‌నగర్‌కు చెందిన ఒకరు, నల్లగొండకు చెందిన ఇద్దరి పేర్లు బెంగళూరు పార్టీకి హాజరైన నేతలుగా ప్రచారం ఉంది. అయితే నిజంగా డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న వారెవరు.. పార్టీకి హాజరైనా సేవించిన వారెవరు.. దానిని తీసుకోని వారెవరు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. బెంగళూరు పోలీసులు మాత్రం విచారణ జరుగు తుందని, విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తా మని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ డ్రగ్స్‌ కేసుపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా జరుగుతున్న విచారణ.. ఎప్పటికి కొలిక్కివస్తుంది.. ఇందులో రాజకీయ ప్రకంపనలు ఉంటాయా? ఆరొపణలు తేలిపోతాయా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఈ కేసులో ఎనిమిది మంది ఈవెంట్‌ మేనే జర్లను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కనబడుతోంది. తాజాగా ఓ ఈవెంట్‌ మేనేజన్‌ కలహర్‌ రెడ్డి, ఉద్యమకారుడిగా చెప్పుకున్న రతన్‌రెడ్డిలకు పోలీసులు నోటీసులు జారీచేశారు. వీరి విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement