Tuesday, November 26, 2024

TG | డ్రగ్స్ కేసులో ఆమెకు 12 ఏళ్ల జైలు శిక్ష..

టాంజానియాకు చెందిన యువతి డ్రగ్స్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2021లో టాంజానియా నుంచి హైదరాబాద్‌కు మూడు కిలోల హెరాయిన్ తీసుకొచ్చినట్లు రుజువు కావడంతో ఆమెకు 12 ఏళ్ల జైలు శిక్ష పడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఆమె ప్రవర్తనపై అనుమానం రావ‌డంతో డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేశారు.. ఈ క్రమంలో ఆమె నుంచి మూడు కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. వెంటనే దానిని స్వాధీనం చేసుకుని యువతిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమె తీసుకొచ్చిన హెరాయిన్ విలువ దాదాపు రూ.19 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement