హైదరాబాద్, : పట్టణాల్లోని ప్రతి ఇంటికీ బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానించాలని, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పరిధిని రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ టీ-హబ్‌లో జరిగిన ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డు సమావేశంలో పనుల పురోగతిని సమీక్షించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయిన గ్రామీణ ప్రాంతాల్లో టీ-ఫైబర్ పనులు పెద్దఎత్తున కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి ప్రతి గ్రామానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ ఇచ్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు అధికారులు వివరించారు. కేటీఆర్ ఆదేశించారు. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయిన గ్రామీణ ప్రాంతాల్లో టీ-ఫైబర్ పనులు పెద్దఎత్తున కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి టీ-ఫైబర్ కనెక్టివిటీ ఇచ్చే లక్ష్యంతో పని చేస్తున్నట్టు అధికారులు వివరించారు.
ఇంటింటికీ ఇంటర్‌నెట్ ఇవ్వాల్సిందే
ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ఇవ్వాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పని చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని 30వేల ప్రభుత్వ కార్యాలయాలకు జూన్ నుంచి ప్రాధాన్యత క్రమంలో కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలను టీ-ఫైబర్‌తో అనుసంధాని ంచాలన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఐదు రైతు వేదికలకు కనెక్షన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. బోర్డు ఆదేశాల మేరకు టీ-ఫైబర్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని అధికారులు వెల్లడించారు.
పట్టణాలలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ – కెటిఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement