Friday, November 22, 2024

గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్ జెంటా, ఏఐసీ

చిన్న, సన్నకారు రైతులకు తగిన సాధికారితను అందించడంతో పాటుగా ఊహాతీత మార్కెట్‌ పరిస్ధితుల కారణంగా ఎదురయ్యే మార్కెట్‌ ఒడిదుడుకుల నుంచి వారిని కాపాడే వినూత్న ప్రయత్నంలో భాగంగా సిన్ జెంటా ఇండియా ఇప్పుడు అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా (ఏఐసీ)తో ప్రత్యేకమైన ఒప్పందాన్ని గుంటూరులోని మిర్చి పంట రైతుల కోసం చేసుకుంది. ఈసంద‌ర్భంగా సిన్ జెంటా ఇండియా చీఫ్ స‌స్టెయిన‌బిలిటీ ఆఫీస‌ర్ డా. కేసీ ర‌వి మాట్లాడుతూ… సిన్ జెంటా వెజిటేబుల్‌ సీడ్స్‌ డివిజన్‌ తో పాటుగా అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ప్రారంభించిన ఈ పథకం మిర్చి రైతులకు ఓ గేమ్‌ ఛేంజర్‌గా నిలువనుందన్నారు.

సిన్ జెంటా ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ ఆసియా వెజిట‌బుల్స్ టెర్రిట‌రీ హెడ్ సంజ‌య్ సింగ్ మాట్లాడుతూ… త‌మ‌ దగ్గర విస్తృత శ్రేణిలో వెజిటేబుల్‌ హైబ్రిడ్స్‌ ఉన్నాయన్నారు. ప్రతి హైబ్రిడ్‌కూ వినూత్నత ఉందన్నారు. గుంటూరులోని అచ్చంపేట మండలంలోని ఓ చిన్న గ్రామంలో 2వేల మందికి పైగా రైతులు సిన్ జెంటా హాట్‌ పెప్పర్‌ హైబ్రిడ్‌ హెచ్‌పీహెచ్‌ 5531 సాగు చేస్తున్నారన్నారు. ఏఐసీ సీఎండీ ఎంకె పొద్దార్ మాట్లాడుతూ… ఏఐసీ ఇప్పుడు చిన్న రైతులకు వినూత్నమైన అవకాశం కల్పిస్తుందన్నారు. వీరంతా కూడా సిన్ జెంటా హాట్‌ పెప్పర్‌ హైబ్రిడ్‌ హెచ్‌పీహెచ్‌ 5331ను సాగు చేస్తున్నారన్నారు. వీరికి ఫసల్‌ భావాంతర్‌ కవచ్‌ మద్దతు ఉందన్నారు. ఏఐసీ ఈ భీమా పథకంతో రైతులకు మార్కెట్‌లో ప్రతికూల ధరల సమయంలో కూడా తగిన రక్షణ లభిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement