హైదరాబాద్: స్విట్జర్లాండ్ టూరిజం బోర్డు హైదరాబాద్‌లోని హయత్ ప్లేస్‌లో స్విట్జర్లాండ్ టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించింది. మహమ్మారి సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ, కొవిడ్ తర్వాత ఈ దేశం బాగా కోలుకుంది. ఈ సందర్భంగా ఈస్ట్ మార్కెట్స్ చీఫ్ మార్కెట్స్ ఆఫీసర్ సైమన్ బోషార్ట్ మాట్లాడుతూ… యాత్రలు, స్విట్జర్లాండ్‌లో గతంలో కంటే ఎక్కువగా విస్తరించాయి- స్విట్జర్లాండ్‌లో గడిపిన ఓవర్‌నైట్‌ల సంఖ్యలో 2019 కంటే 2023 మెరుగ్గా ఉంది – వేసవి, శీతాకాలం, స్కీ గమ్యస్థానాలకు విక్రయించబడిన వసతి, ముందస్తుగా బుక్ చేసిన కార్యకలాపాలను తాము చూస్తున్నామన్నారు.
మహమ్మారి తర్వాత భారతదేశం నుండి ఎక్కువ మంది వినూత్న అనుభవాలను కోరుకుంటున్న ప్రయాణికులను తాము చూస్తున్నామన్నారు. వీరు తమ దేశంలో ఎక్కువ కాలం వుంటున్నారన్నారు. స్థానిక సంస్కృతిలో లీనమవుతున్నారు. అలాగే దేశంలో పర్యటించడానికి ప్రజా ప్రయాణ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు, తద్వారా పర్యాటకాన్ని మరింత పర్యావరణ అనుకూలంగా మలచాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
స్విట్జర్లాండ్ టూరిజం – ఇండియా డిప్యూటీ డైరెక్టర్ అండ్ మార్కెటింగ్ హెడ్ రీతు శర్మ మాట్లాడుతూ… స్విట్జర్లాండ్ లో ప్రతి సంవత్సరం పర్యాటకులను ఆకర్షిస్తున్న విషయం ఏమిటంటే, ఇది ప్రయాణీకుల సమయాన్ని గౌరవించే బాధ్యతాయుతమైన, స్థిరమైన ప్రయాణ గమ్యస్థానం, స్వచ్ఛమైనది, వ్యవస్థీకృతమైనదన్నారు. అన్నింటికంటే ఎక్కువగా ప్రకృతి సౌందర్యంతో ఆశీర్వదించబడిందన్నారు. కొవిడ్ తర్వాత ఎక్కువ మంది వ్యక్తిగత, చిన్న సమూహాలుగా ప్రయాణించడం తాము చూస్తున్నామన్నారు.