హైదరాబాద్ : స్వచ్ఛమైన శాఖాహార దక్షిణ భారతీయ వంటకాలకు పర్యాయపదంగా నిలిచిన స్వాద్ ఆఫ్ సౌత్, హైదరాబాద్‌లోని అత్యంత ఉత్సహపూరిత వాతావరణం కలిగిన మాదాపూర్ లో తమ తాజా అవుట్‌లెట్ ను ప్రారంభించినట్లు సగర్వంగా వెల్లడించింది. ఈ ఆవిష్కరణ దక్షిణ భారతదేశ రుచులను సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చేయడంలో బ్రాండ్ తిరుగులేని నిబద్ధతలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.
ఈ సందర్భంగా స్వాద్ ఆఫ్ సౌత్ సహ వ్యవస్థాపకుడు రోనక్ సింఘి మాట్లాడుతూ… తమ ప్రయాణం సంతోషకరంగా సాగిందన్నారు. దక్షిణ భారత కలినరి వారసత్వం స్ఫూర్తిని వేడుక జరుపుకునే అనుభవాన్ని రూపొందించడానికి తాము తమ మనసా, వాచా కృషి చేసామన్నారు. తమ మాదాపూర్ అవుట్‌లెట్ ప్రారంభంతో స్వచ్ఛమైన శాఖాహార వంటకాలపై తమ అభిరుచిని హైదరాబాద్‌లోని ఉత్సాహ పూరిత కమ్యూనిటీ చెంతకు తీసుకురావడానికి తాము సంతోషిస్తున్నామన్నారు.
స్వాద్ ఆఫ్ సౌత్ సహ వ్యవస్థాపకుడు కృష్ణ చౌదరి మాట్లాడుతూ… ఉత్సాహ పూరిత వాతావరణం, విభిన్న జనాభాకు ప్రసిద్ధి చెందిన మాదాపూర్ తమ కలినరి ప్రయాణాన్ని విస్తరించడానికి సరైన ప్రదేశంగా తమకు నిలుస్తుందన్నారు. తాము ఈ ఉత్తేజకరమైన నూతన వెంచర్‌ను ప్రారంభించినప్పుడు, దక్షిణ భారత వంటకాల ఆనందాన్ని హైదరాబాద్‌లో, మరిన్ని ప్రాంతాల్లో పంచుకునే అవకాశం గురించి తాము ఆసక్తిగా ఉన్నామన్నారు. హైదరాబాద్‌లో స్వాద్ ఆఫ్ సౌత్ ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలకు మాదాపూర్ అవుట్‌లెట్ ప్రారంభం మాత్రమే. స్వాద్ ఆఫ్ సౌత్ తన వేగవంతమైన విస్తరణను కొనసాగించాలని భావిస్తోందన్నారు.