హెర్నియాను జీవనశైలి మార్పులతో నయం చేసుకోవచ్చని చాలామంది భావిస్తారని, కానీ హెర్నియాకు శస్త్ర చికిత్స మాత్రమే మార్గమని హైదరాబాద్‌లోని లివ్‌లైఫ్ హాస్పిటల్‌కు చెందిన ఏడబ్ల్యుఆర్ లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ అంకిత్ మిశ్రా తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ఎవరికైనా ఉదర కండరాల్లో ఒక బలహీనమైన ప్రాంతం మీదుగా అవయవాలు చర్మం కిందివైపు వస్తే, దాన్నే హెర్నియా అంటారు. శస్త్రచికిత్సలు, శారీరక శ్రమ, ఊబకాయం లేదా గర్భధారణ వల్ల ఉదర కండరాలు బలహీనపడితే ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుంటుందన్నారు. హెర్నియా చర్మం ఉపరితలం మీద వాపులా కనపడుతుందన్నారు. దాన్ని చేత్తో లోపలకు తోయచ్చన్నారు. ఎక్కువగా పురుషులకు ఈ సమస్య ఏర్పడుతుందని, వారికి వచ్చేవాటిలో 90శాతం గజ్జకు సంబంధించినవే అవుతాయన్నారు. ఉదర కుహరంలో రంధ్రం తనంతట తానే మూతపడదని, చికిత్స చేసి మూయాలన్నారు. తర్వాత మెష్ అనే ఒక పరికరంతో ఉదరకోశాన్ని బలోపేతం చేయాలన్నారు. అందువల్ల జీవనశైలి మార్పులు, మందుల వల్ల హెర్నియా బాగవ్వదని, చికిత్స ఒక్కటే దానికి ఉన్న చికిత్స అని వివరించారు. మెష్ అనేది అధునాతన, బాగా పరిశోధించిన సింథటిక్ లేదా సెమీ-సింథటిక్ జీవ పదార్థమన్నారు. మానవ శరీరంలో అత్యంత కీలకమైన ఉదర వ్యవస్థ సమగ్రతను పునరుద్ధరించాలని, వీలైనంత ఉత్తమ ఫలితాలను అందించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని డాక్టర్ మిశ్రా చెప్పారు. హెర్నియా చికిత్సలో మూడు రకాలున్నాయి. అవి.. సాధారణ శస్త్రచికిత్స, లాప్రోస్కొపిక్ లేదా రోబోటిక్ లాప్రోస్కొపిక్ శస్త్రచికిత్స అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement