Saturday, November 23, 2024

సూరీడుపై దాడి చేసిన అల్లుడు..

హైదరాబాద్ :సూరీడుపై దాడి జరిగింది. అది చేసింది స్వయానా అల్లుడే కావడం విశేషం. ఇంతకీ ఈ సూరీడు ఎవరంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందాడు సూరీడు. వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెన్నంటే ఉండేవాడు. తాజాగా సొంత అల్లుడే అతడిపై దాడి చేశాడని తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని సూరీడు ఇంటికి వచ్చిన అల్లుడు సురేంద్రనాథ్‌ క్రికెట్‌ బ్యాట్‌తో అతడిపై దాడి చేశాడు. గతంలో సురేంద్రనాథ్‌పై సూరీడు కూతురు గృహహింస కేసు పెట్టింది. దీంతో కేసు ఉపసంహరించుకోవడం లేవని సురేంద్రనాధ్ గతంలో బెదిరింపులకు దిగాడు. ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చే దాడి చేశాడని తెలుస్తోంది. సూరీడు కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అతడి కుమార్తె గంగా భవానీని సురేంద్రనాథ్‌ కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన భవానీ పుట్టింటికి వచ్చేసి అతడిపై గృహ హింస కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement