Saturday, November 23, 2024

భూ నిర్వాశితుల ప‌రిహారంపై రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌లు వినండి – హైకోర్టుకి సుప్రీం ఆదేశం..

న్యూఢిల్లీ/ హైద‌రాబాద్ – భూ నిర్వాశితులైన పెళ్లి కాని మేజర్ యువతీయువకులకు కూడా విడిగా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తోసిపుచ్చింది.. ఈ పిటిష‌న్ పై తిరిగి తెలంగాణ హైకోర్టు ధ‌ర్మాస‌నం తిరిగి విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించంది.. వివ‌రాలోకి వెళితే తెలంగాణ సర్కారు కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి ప్రాజెక్టులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించడం తెలిసిందే. అయితే నిర్వాసితులలో మేజ‌ర్ యువ‌తీ, యువ‌కుల‌కూ ప‌రిహారం ఇవ్వాల‌ని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. దీనిపై నేడు తెలంగాణ సర్కారు తరఫున సీనియర్ అడ్వొకేట్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. గతంలో పూర్తి వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. వైద్యనాథన్ వాదనలతో జస్టిస్ ఖన్ విల్కర్ ధర్మాసనం ఏకీభవించింది. నిర్వాసితుల అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనబెడుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం అంశంలో దాఖలైన పిటిషన్లపై పూర్తిస్థాయిలో వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టును నిర్దేశించింది. అది కూడా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనమే విచారణ చేపట్టాలని పేర్కొంది. అటు, హైకోర్టులో వాయిదాలు కోరవద్దంటూ అడ్వొకేట్ జనరల్ కు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement