Friday, November 22, 2024

ప‌ర్య‌వేక్ష‌క లోపంతోనే కింగ్ కోఠిలో మ‌ర‌ణాలు..

హైదరాబాద్‌, : ఆక్సిజన్‌ కొరత.. చికిత్స తీసుకుంటున్న కొవిడ్‌ రోగులపాలిట శాపంగా మారింది. హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఆదివారం కరోనా బాధితులకు అందుతున్న ఆక్సిజన్‌ అయిపోయేవరకు.. పర్యవేక్షకులు, డాక్టర్లు నిర్లక్ష్యం వహించిన ఫలితంగా 20మంది బాధితులు ఊపిరాడక విలవిల్లాడగా, ఇందులో ముగ్గురు మృతిచెందారు. తెలంగా ణలో ఇప్పటివరకు.. ఆక్సిజన్‌ కొరత కారణం గా ఎవరూ చనిపోకపోగా, ఆదివారం ఆక్సిజన్‌ కొరత ముగ్గురిని బలిగొంది. ఆస్పత్రిలోని ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ ట్యాంక్‌లో ఆక్సిజన్‌ అయిపోవడంతో.. మరో ట్యాంక్‌ రావడానికి ఆలస్యం కావడం వల్ల సమస్య తలెత్తింది. ముగ్గురి ప్రాణాలు పోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నుండి వచ్చే ఆక్సిజన్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌కు చిరునామా తెలియకపోవడం వల్ల ముందు ఉస్మాని యా ఆస్పత్రికి వెళ్ళాడు. విషయం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు కింగ్‌కోఠి ఆస్పత్రికి ట్యాంకర్‌ను తరలించారు. అప్పటికే ఆక్సిజన్‌ అయి పోయి.. 20మంది కరోనా బాధితులు తీవ్ర ఇబ్బం దులు పడగా, అందులో ముగ్గురు ఆక్సిజన్‌ అందక చనిపోయారని బాధితుల కుటుంబసభ్యులు చెప్పారు. ప్రాణవాయువు నిలిచి పోయే వరకు వేచిచూసి నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.
ఏదీ టాస్క్‌ఫోర్స్‌?
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా.. చూసేందు కు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిరం తరం పర్యవేక్షించేందుకు సీఎం కేసీఆర్‌ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి నేతృత్వ ంలో ఓ కమిటీని నియమిం చారు. సీఎస్‌ ప్రతి రోజూ సమీక్షలు జరుపుతున్నారు. అయినా ఆక్సిజన్‌ అందక, రాజధాని నడిబొడ్డులో.. రాష్ట్ర వైద్యకేంద్రానికి కూత వేటు దూరంలో.. ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. ఒవైపు ప్రజలు కరోనాతో విలవిల్లాడుతూ.. తీవ్ర భయాందోళనలు చెందుతున్నా మభ్యపెట్టే లెక్కలతో అధికారులు తీవ్రతను తగ్గించి చూపుతున్నారని, ఫలితంగా మరణాలు సంభవిస్తున్నాయని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రులలో బెడ్లకొరత, మందులకొరత, ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement