Tuesday, November 26, 2024

అతిపెద్ద కమ్యూనిటీగా సూపర్‌బాటమ్స్‌ ‘పేరెంట్‌ ట్రైబ్‌’

భారతదేశంలో సుప్రసిద్ధ మామ్‌ అండ్‌ బేబీ కేర్‌ బ్రాండ్‌, సూపర్‌బాటమ్స్‌ ఫేస్‌బుక్‌ కమ్యూనిటీ – పేరెంట్‌ ట్రైబ్‌లో ఇప్పుడు 78వేల మందికి పైగా పేరెంట్స్‌ నమోదు చేసుకోవడం ద్వారా భారతదేశంలో ఫేస్‌బుక్‌పై పేరెంట్స్‌ (తల్లిదండ్రులు) కోసం పేరెంట్స్‌ చేత పేరెంట్స్‌ ప్రారంభించిన అతిపెద్ద కమ్యూనిటీగా నిలిచింది. ఈసంద‌ర్భంగా సూపర్‌బాటమ్స్‌ సీఈఓ, కో–ఫౌండర్‌ పల్లవి ఉతగి మాట్లాడుతూ.. సూపర్‌బాటమ్స్‌ వద్ద త‌మ వరకూ పేరెంట్‌ ట్రైబ్‌ అనేది త‌మ వ్యక్తిగత పేరెంట్స్‌ సైన్యమ‌న్నారు. ఈ బ్రాండ్‌తో వారు లోతైన బంధం కలిగి ఉన్నారన్నారు. త‌మ వినియోగదారులకు ఆవల, త‌మ ట్రైబ్ త‌మకు ప్రచారకులుగా తోడ్పడటమే కాదు, నిజాయితీగా ఉండేందుకు, స్థిరంగా ఆవిష్కరణలను జరిపేందుకు, అత్యున్నత ఉత్పత్తులను సహ సృష్టించేందుకు సైతం తోడ్పడుతుందన్నారు. త‌మ పేరెంట్‌ ట్రైబ్‌లో ఒకరు చేరితే, వారు నిరంతరం పెరుగుతున్న పేరెంట్స్‌ కమ్యూనిటీలో భాగమవుతారన్నారు. వారి పేరెంటింగ్‌ ప్రయాణంలో తాము భాగస్వాములవుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement