Tuesday, November 26, 2024

నెక్లెస్ రోడ్ లో అట్ట‌హాసంగా స‌మ్మ‌ర్ కార్నివాల్ ప్రారంభం

హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో శుక్రవారం రాత్రి సమ్మర్ కార్నివాల్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వేలాదిగా తరలిరావడంతో థ్రిల్ సిటీ సందడిగా మారింది. థ్రిల్ సిటీ ప్రారంభించి 6 నెలలు పూర్తయిన సందర్భంగా నిర్వాహకులు భారీగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేసిన అనంతరం థ్రిల్ సిటీ సమ్మర్ కార్నివాల్ లోగో, ఆన్ లైన్ బుకింగ్ వెబ్ సైట్ (WWW.THRIL.CITY) ను ప్రారంభించారు. అదేవిధంగా థ్రిల్ సిటీకి వచ్చే వారికి అందజేసే లక్కీ కూపన్ ను కూడా మంత్రి విడుదల చేశారు. ఈనెల 25వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు సమ్మర్ కార్నీవాల్ ను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు మంత్రికి వివరించారు.

సమ్మర్ కార్నివాల్ సందర్భంగా చిన్నారులకు రూ.699, పెద్దలకు రూ.999 లకే థ్రిల్ సిటీ లోపలికి ప్రవేశంతో పాటు అన్ని రైడ్ లను ఉచితంగా అనుమతించనున్నట్లు చెప్పారు. నిత్యం వివిధ రకాల పని వత్తిడులకు గురవుతూ మానసిక ప్రశాంతత కోరుకునే వారికి, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు అనువుగా ప్రపంచ స్థాయి గేమింగ్, వినోద సౌకర్యాలతో థ్రిల్ సిటీ థీమ్ పార్క్ ను నిర్మించడం జరిగిందని చెప్పారు. అన్ని వయసుల వారిని ఆకర్షించేలా రైడింగ్ మాన్ స్టర్ థియేటర్, స్ప్లాష్ కోస్టర్. ఫ్లైట్ సిమ్యులేటర్లు, స్కోడా కార్ సిమ్యులేటర్, విర్చువల్ రియాలిటీ గేమ్స్, ఫన్ హౌస్, క్రికెట్ సిమ్యులేటర్, బౌలింగ్ అల్లే, బంపర్ కార్లు, ఫుట్‌సాల్, మ్యాజిక్ ట్రైన్, హార్స్ రంగులరాట్నం, ఇలా అనేకమైన గేమింగ్ జోన్, ఫుడ్ కోర్ట్ ఈ థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లోని ప్రత్యేకతలు అని నిర్వాహకులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లు రజనీకాంత్, అనిల్, బాలరాజ్, అబ్రహం, హిమాన్షు, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement