Friday, November 22, 2024

శివ్ నారాయణ్ జ్యువెలర్స్ రూపొందించిన‌ శ్రీ అనంత పద్మనాభస్వామి ని ఆవిష్కరించిన సుధారెడ్డి


హైద‌రాబాద్, ఆగ‌స్టు 16 (ప్ర‌భ న్యూస్) : శివ్ నారాయణ్ జ్యువెలర్స్ తమ తాజా కళాఖండం శ్రీ అనంత్ పద్మనాభస్వామి ప్రతిమ ను హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఆవిష్కరించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహోన్నత దాత, స్టైల్ ఐకాన్ సుధారెడ్డి, హైదరాబాద్‌లోని తమ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాత్మక వైభవం, నైపుణ్యంతో కూడిన పనితనం, గొప్ప సాంస్కృతిక వారసత్వం వేడుకగా ఈ కార్యక్రమం నిలిచింది. శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ అగర్వాల్ ఈ మైలురాయిని చేరుకున్నందుకు తన ఆనందం వ్యక్తీకరించారు. సుధా రెడ్డికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీ అనంత పద్మనాభస్వామి ప్రతిమ సృష్టి త‌మ బృందం అంకితభావం, అభిరుచికి సంబంధించింద‌న్నారు. ముఖ్యంగా ఈ కళాఖండం త‌మ కళాకారుల కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబించడమే కాకుండా మన సంస్కృతి గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

ఈ అసాధారణ సృష్టిని ఆవిష్కరించిన సుధారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం కళ, సంస్కృతి విలాసవంతమైన కలయికగా గుర్తించబడిందన్నారు. అతిథులు శ్రీ అనంత పద్మనాభస్వామి అందాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారన్నారు. కేరళలోని తిరువనంతపురంలోని ప్రతిష్టాత్మక శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ప్రతిష్టించబడిన దివ్య విగ్రహం నుండి ప్రేరణ పొందిన ఈ ఆభరణం సూక్ష్మమైన అంశాలను సైతం విశేషమైన ఖచ్చితత్వంతో ఒడిసిపట్టిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement