Monday, November 25, 2024

Hong Kong: ఏప్రిల్‌ 7న ఢిల్లీలో స్టడీ ఇన్‌ హాంగ్‌కాంగ్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌

హైదరాబాద్ : హాంగ్‌కాంగ్‌లో అగ్రగామి ఎనిమిది యూనివర్శిటీలలో ఉన్నత విద్యావకాశాలను అందించేందుకు స్టడీ ఇన్‌ హాంగ్‌కాంగ్‌ పేరిట ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లను నిర్వహిస్తుంది హాంగ్‌కాంగ్‌ ఎస్‌ఏఆర్‌ ప్రభుత్వం. న్యూఢిల్లీ లోని లలిత్‌ హోటల్‌లో ఏప్రిల్‌ 7వ తేదీన ఈ ఫెయిర్‌ జరుగనుందని, హాంగ్‌కాంగ్‌లో ఉన్నత విద్యనభ్యసించే వినూత్న అవకాశాలను విద్యార్ధులు పొందగలరని యూనివర్శిటీ ఆఫ్‌ హాంగ్‌కాంగ్‌లో అండర్‌గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఎక్సేంజ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బెన్నెట్‌ యిమ్ తెలిపారు.

ఈ ఫెయిర్‌లో పాల్గొనడం ద్వారా హాంగ్‌కాంగ్‌లో తాజా విధానాలు, అక్కడ చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవచ్చన్నారు. ఈ ఫెయిర్‌ను విద్యార్ధులు, తల్లిదండ్రులకు అత్యంత అనుకూలంగా ఉండనుందన్నారు. హాంగ్‌కాంగ్‌లో యూనివర్శిటీలు విద్య పరంగా అంతర్జాతీయంగా అత్యుత్తమంగా గుర్తించబడ్డాయంటూ ఇక్కడ భాషా పరమైన అవరోధాలు కూడా విద్యపరంగా ఉండవన్నారు. భారతీయ విద్యార్ధులకు చక్కటి విద్యతో పాటుగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement