Friday, November 22, 2024

HYD: వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు : టి.ఉషా విశ్వనాథ్

నెల రోజుల్లో 224 మంది ఆకతాయిలను పట్టుకున్న రాచకొండ షీ టీమ్స్.. బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్‌ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని డీసీపీ ఉషా విశ్వనాథ్ తెలిపారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్‌ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నారన్నారు.

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఐ‌పిఎస్ ఆదేశానుసారం, రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 224 మందిని (మేజర్స్-140, మైనర్స్ -84) షీ టీమ్స్ వారు అరెస్టు చేశారు. వారికి ఎల్‌బి నగర్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు నందు భూమిక ఉమెన్స్ కలెక్టివ్ వారి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.

గత డిసెంబర్ లో ఫిర్యాదులు అందాయని, ఉమెన్ సేఫ్టీ వింగ్ రాచకొండ డీసీపీ టి.ఉషా విశ్వనాథ్ తెలిపారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. అందిన ఫిర్యాదుల్లో ఫోన్ల ద్వారా వేధించినవి-60, వాట్సాప్ కాల్స్ అండ్ మెసేజెస్ ద్వారా వేధించినవి – 120, సోష‌ల్ మీడియా యాప్స్ ద్వారా వేదించినవి- 60, నేరుగా వేధించినవి – 50. వాటిలో క్రిమినల్ కేసులు-12, పెట్టి కేసులు- 131, అలాగే 84 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే కళాశాల విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీలను అరెస్టు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. తుర్కయంజాల్ లో గల ఫార్మసీ కాలేజ్ వద్ద ఈవ్ టీజింగ్ చేస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే స్పందించిన షీ టీమ్ ఇబ్రహీంపట్నం అక్కడికి చేరుకొని ఈవ్ టీజింగ్ చేస్తున్నా.. ముగ్గురు పోకిరీలను అదుపులోకి తీసుకొని వారిపైన ఆదిభట్ల పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement