Tuesday, November 19, 2024

రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి..

నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట కుక్కకాటుకు గాపడుతున్న బాధితల సంఖ్య పెరుగుతుంది. నాలుగేళ్ల బాలుడు కుక్క కాటుకు బలైన ఘటన మరువకముందే మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. తాజాగా అత్తాపూర్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికులు కుక్కలను తరిమి బాలుడిని కాపాడారు. స్వల్ప గాయాలు కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement