Tuesday, November 26, 2024

స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్‌ సమస్యకి పరిష్కారం..

కవాడిగూడ : ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌ ఇందిరాపార్కు నుంచి బాగ్‌లింగంపల్లి విఎస్‌టి వరకు నిర్మించతపెట్టిన స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్‌ సమస్య శాశ్వితంగా పరిష్కారం అవుతుందని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. సుమారు 426 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎమ్యెల్యే ముఠా గోపాల్‌, చిక్కడపల్లి ట్రాఫిక్‌ సిఐ ప్రభాకర్‌రెడ్డి, ప్రాజెక్ట్‌ డివిజన్‌ ఈఈ గోపాల్‌, డిప్యూటీ ఈఈ సుదర్శన్‌, మాజీ కార్పోరేటర్‌లు సందర్శించి నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మాట్లాడుతూ 2022 డి సెంబర్‌ చివరినాటికీ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ఆయన వెల్లడిం చారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పనుల్లో కొంత ఇబ్బంది ఏర్పడుతుందని, చాలా చోట్ల టెలిఫోన్‌ కేబుల్స్‌, వాటర్‌లై న్‌లు, డ్రైనేజి పైపులైన్లు అడ్డురావడంతో ప నుల్లో జాప్యం జరుగుందని అయన వెల్లడించారు. బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 75 పిల్లర్లు నిర్మిస్తున్నారని, భూమి లెవల్‌ వరకు సిమెంట్‌ దిమ్మెలు నిర్మించి అనంతరం స్టీల్‌ పిల్లర్లు, బ్రిడ్జి ఫిటింగ్‌ చేస్తారని ఆయన తెలిపారు. ముషీరాబాద్‌ నియోజకవర్గమే కాకుండా గ్రేట ర్‌ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆదే విధంగా రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు మరో 30 పిల్లర్‌లతో స్టీల్‌ వంతెన నిర్మిస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్ర మంలో టిఆర్‌ఎస్‌ నేతలు ముఠా జయసింహా, రాంచందర్‌, కిరణ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement