మెట్ల బావి పునరుద్ధరణ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం బన్సీలాల్ పేటలోని మెట్లబావి పునరుద్ధరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే పురాతన నిర్మాణాల పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వివరించారు. అందులో భాగంగానే నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెట్ల బావి చెత్త చెదారాలతో నిండిపోగా పూర్తిగా తొలగించి పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామన్నారు. బావితో పాటు పరిసరాల అభివృద్ధి కోసం అవసరమైన స్థలాలను సేకరించి అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి వెంట జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎంసీ ముకుంద రెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ఎస్ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు కల్పన, తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement