Wednesday, November 20, 2024

అసోచామ్‌ తెలంగాణ చాప్టర్‌ కో-చైర్మన్‌గా శ్రీధర్‌

హైదరాబాద్ : అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) తెలంగాణ చాప్టర్ తమ మొట్టమొదటి స్టేట్ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మండలి చైర్మన్‌ కటారు రవికుమార్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో సీటీఆర్ఎల్ఎస్ డాటా సెంటర్స్ అండ్ క్లౌడ్ 4సీ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డిని అసోచామ్ తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కో-ఛైర్మన్‌గా ఎన్నికున్నారు. పిన్నపురెడ్డి, తొలితరం వ్యాపారవేత్త, టెక్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి, ఆయన 2023-24 సంవత్సరానికి అసోచామ్ కో-ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మండలి చైర్మన్ కటారు రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ… దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. ప్రధాన పరిశ్రమలలోని అవకాశాలను అన్వేషించడం కోసం ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేయడంలో రాష్ట్ర అభివృద్ధి మండలి లక్ష్యాన్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ, అసోచామ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ హెడ్ మచ్చా దినేష్ బాబు ముగింపు వ్యాఖ్యలు చేయడంతో పాటుగా సుమారు 30 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చురుకుగా పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement