హైదరాబాద్ : సౌదీ జాతీయ పర్యాటక బ్రాండ్, సౌదీ వెల్‌కమ్ టు అరేబియా భారతీయ మార్కెట్ కోసం తమ మొట్టమొదటి సమగ్ర వినియోగదారు ప్రచారం – స్పెక్టాక్యులర్ సౌదీని ప్రారంభించింది. పురాతన కథలు, ఆధునిక అద్భుతాల ఆకర్షణీయమైన సమ్మేళనంతో, ఈ ప్రచారం సౌదీ గురించిన అన్ని అంచనాలను మించిపోయిన రీతిలో వుంది.
ఈ ప్రచారంపై సౌదీ టూరిజం అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అల్హసన్ అల్దబ్బాగ్ మాట్లాడుతూ…. భారతీయ ప్రయాణికులు చాలా కాలంగా ప్రామాణికమైన, విశిష్టమైన అనుభవాల పట్ల విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారన్నారు. వారు కొత్త గమ్యస్థానాలు, సంస్కృతులు, రుచులను అన్వేషించడానికి ఆసక్తిని కలిగి ఉన్నారన్నారు. సౌదీ ఇప్పుడు అదే అందిస్తోందన్నారు. సౌదీ ఎనిమిది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో మూడు దిరియా, అల్ బలాద్, అల్ ఉలా వంటి ప్రతిష్టాత్మక గమ్యస్థానాలతో, వారు సహస్రాబ్దాల నాటి చరిత్రలో నడవగలరన్నారు.
తమకు అనుకూలంగా మార్చిన ప్యాకేజీలతో ప్రపంచ స్థాయి సంస్కృతి, సాహసం, వంటకాలను ఆస్వాదించవచ్చన్నారు. తమ వారసత్వంలో ప్రధాన భాగమైన సౌదీ అరేబియా స్వాగతాన్ని, భారతీయ సంస్కృతికి అంతర్లీనంగా ఉన్న అనుభూతిని భారతీయులు అనుభవించేలా చేయటానికి తాము సంతోషిస్తున్నామన్నారు. భారతదేశం తమ హృదయాల్లో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు. 2030 నాటికి భారతదేశాన్ని అగ్రగామి సోర్స్ మార్కెట్‌గా మార్చడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.