డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిముషాలు 10 వారాల పాటు పరిశుభ్రత కార్యక్రమంను బంజారాహిల్స్ క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్యతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. నగరంలో దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డెంగ్యూ వ్యాధి నివారణకు అధికారులు కృషి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సంతోష్, చీఫ్ entomologist రాంబాబు, జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమీషనర్ రజినీకాంత్ పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement