హైదరాబాద్ : సవితా దామోదర్ పరాంజపే టెలిప్లే దక్షిణ-భారత ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుంది, థ్రిల్ చేస్తుందని శిల్పా తులస్కర్ అన్నారు. శిల్పా తులస్కర్ వైవిధ్యమైన కళాకారిణి, థియేటర్‌లో తనదైన ముద్ర వేశారు. ఇటీవల జీ థియేటర్ విడుదల చేసిన సవితా దామోదర్ పరాంజపేతో సహా పలు టెలిప్లేలలో ఆమె నటించారు. ఇక్కడ ఆమె పాత్ర విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ టెలిప్లే ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రేక్షకుల కోసం కన్నడ, తెలుగులోకి అనువదించబడింది.
మరాఠీ నాటక రచయిత శేఖర్ తమ్హానే రచించిన సవితా దామోదర్ పరాంజపే ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని శిల్పా తులస్కర్ తెలిపారు. ఈ టెలిప్లే ప్రధాన దక్షిణ-భారత భాషలలో ప్రదర్శించబడుతోంది కాబట్టి, అది వారితో కూడా సజావుగా కనెక్ట్ అవుతుందని తాను నిజంగా నమ్ముతున్నానన్నారు. ఈ కథ, దాని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్‌తో కూడిన కథనంతో, అన్ని రకాల ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ఆమె చెప్పారు. కొత్త తరానికి థియేటర్‌ని పరిచయం చేయడానికి టెలిప్లేలు మంచి మార్గమని శిల్పా అభిప్రాయపడ్డారు. మనకు భారతీయ సాహిత్యంలో పాత క్లాసిక్‌ల గొప్ప వారసత్వం ఉందన్నారు. టెలిప్లేలు ఆ రచనలను అందంగా పునరుద్ధరించడానికి అవకాశాన్ని అందిస్తాయని ఆమె ముగించారు.