Wednesday, November 20, 2024

త్వరలో మ‌రిన్ని వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేస్తాం : మంత్రి తలసాని

రాష్ట్రంలోని జీవాల సంఖ్యకు అనుగుణంగా పశువైద్యులను యూనివర్సిటీ తీర్చిదిద్దుతుంద‌ని, త్వరలో సిద్ధిపేట, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో కొత్తగా వెటర్నరీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామ‌ని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో వెటర్నరీ క్లినిక్‌ కాంప్లెక్స్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ… ద్యార్థులకు యూనివర్సిటీ మెడిసిన్, గైనకాలజీ, డయాగ్న సిస్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్ని ఒకే భవనంలో అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో ఎండో స్కోపీ, స్కానింగ్, బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకువస్తామని, ఇతర రాష్ట్రాల విద్యార్థులను సైతం ఆకర్షించేలా అత్యాధునిక పరికరాలతో కూడిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement