Friday, November 22, 2024

HYD: కొన్ని ఉత్తమ సస్పెన్స్ థ్రిల్లర్‌లు దక్షిణ భారతంలోనే… కునాల్ రాయ్ కపూర్

హైదరాబాద్ : కొన్ని ఉత్తమ సస్పెన్స్ థ్రిల్లర్‌లు దక్షిణ భారతదేశంలోనే రూపొందించబడ్డాయని కునాల్ రాయ్ కపూర్ వెల్లడించారు. 2006లో ది ప్రెసిడెంట్ ఈజ్ కమింగ్ అనే కామెడీకి దర్శకత్వం వహించిన కునాల్ రాయ్ కపూర్, జస్ట్ మొహబ్బత్ (1997), ముంబయి కాలింగ్ (2009), ఢిల్లీ బెల్లీ (2011), యే జవానీ హై దీవానీ (2013), అనేక చిత్రాల్లో ప్రతిభా వంతుడైన నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. జీ థియేటర్ ఉత్కంఠభరితమైన టెలిప్లే, షద్యంత్ర లో పరిశోధనాత్మక పోలీసు అధికారిగా ముఖ్యమైన పాత్ర పోషించిన ఆయన దాని ఆకట్టుకునే కథాంశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

దక్షిణ భారతదేశంలోని థియేటర్, సినిమా గొప్ప వారసత్వం గురించి కపూర్‌ మాట్లాడుతూ… తాను ప్రాంతీయ నాటక రచయితలు, చిత్రనిర్మాతలను బాగా ఆరాధిస్తానన్నారు. కన్నడకు చెందిన హయవదన వంటి ప్రాంతీయ క్లాసిక్‌ల కొన్ని అద్భుతమైన ఆంగ్ల అనుసరణలలో తాను భాగమయ్యానన్నారు. గొప్ప నాటక రచయిత, నటుడు, దర్శకుడు గిరీష్ కర్నాడ్ రచించిన నాటకం అదన్నారు. తాము ముంబై, కోల్‌కతాలో ప్రదర్శనలు చేసామన్నారు. అవి చాలా బాగా ప్రశంసించబడ్డాయన్నారు. ఈ టెలిప్లేకి గణేష్ యాదవ్ దర్శకత్వం వహించారు. హీనా ఖాన్, చందన్ రాయ్ సన్యాల్, శ్రుతి బాప్నా కూడా దీనిలో నటించారు. ఇది నవంబర్ 4న ఎయిర్‌టెల్ థియేటర్, డిష్ టీవీ రంగ్‌మంచ్ యాక్టివ్, డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్‌లలో ప్రసారం చేయబడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement