Saturday, November 23, 2024

Singareni | ప్రశాంతంగా ముగిసిన సింగరేణి ఉద్యోగ నియామక పరీక్షలు…

ఆంధ్ర ప్రభ స్మార్ట్ హైదరాబాద్ – సింగరేణి సంస్థలో ఉద్యోగాల కోసం ఈనెల 20, 21వ తేదీలలో 12 సెంటర్లలో నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరామ్ ఆదేశాల మేరకు తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా సింగరేణిలో 272 ఖాళీల భర్తీకి పరీక్షలను అత్యంత పటిష్టంగా, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నిర్వహించారు.

20వ తేదీన జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఏ), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ హైడ్రోజియాలజిస్ట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ సివిల్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐఈ), సబ్ ఓవర్ సర్ ట్రైనీ సివిల్ పోస్టులకు పరీక్ష నిర్వహించారు. మూడు షిఫ్టులలో నిర్శ‌హించిన‌ ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 11724 మంది అభ్యర్థుల్లో 7073 మంది అభ్యర్థులు (60.53 శాతం) పరీక్షలు రాశారు.

అలాగే 21న మేనేజ్ మెంట్ ట్రైనీ (మైనింగ్ ), మేనేజ్ మెంట్ ట్రైనీ (పర్సనల్ ) పోస్టులకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించగా… మొత్తం 6931 మంది అభ్యర్థుల్లో 4972 (71.73 శాతం) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 18665 మందికి హాల్ టికెట్లు జారీ చేయగా… 12045 మంది పరీక్షలకు హాజరయ్యారు. దాదాపు 65 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షల‌కు ఫెయిల్ హారయ్యారు.

ఆదివారం కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం, డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్) ఎన్.వి.కె. శ్రీనివాస్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలను సమీక్షించారు. ఈ పరీక్ష‌ల‌ ప్రాథమిక జవాబు పత్రం (కీ) త్వరలో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షల సందర్భంగా పూర్తి పారదర్శకంగా బయోమెట్రిక్, ఐరిష్ పరికరాల ద్వారా అభ్యర్ధుల వివరాల నమోదు, తనిఖీ చేపట్టారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు విజయవంతంగా జరిగాయని సీఎండీ ఎన్.బలరాం ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో ఎవరి ప్రమేయం ఉండదని, సిఫారసు చేయబోమని… ఎవరైనా మోసగాళ్లు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే నమ్మవద్దని, వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని సీఅండ్ ఎండీ ఎన్. సింగరేణి విజిలెన్స్ విభాగం, పోలీసు శాఖ. బలరాం కోరారు.

- Advertisement -

పోస్టుల వారీగా అభ్యర్థుల హాజరు ఇలా..

జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ పోస్టుకు 406 మంది, మేనేజ్మెంట్ ట్రెయినీ(ఎఫ్ అండ్ ఏ) పోస్టుకు 279, మెడికల్ ఆఫీసర్ పోస్టుకు 407 మంది, మేనేజ్మెంట్ ట్రెయినీ(హైడ్రోజియోలజిస్టు) పోస్టుకు 96 మంది, మేనేజ్మెంట్ ట్రెయినీ(సివిల్) పోస్టుకు 3388 మంది, జూనియర్ ఫారెస్టు ఆఫీసర్ పోస్టుకు 346 మంది, మేనేజ్మెంట్ ట్రెయినీ (ఐఈ) పోస్టుకు 123 మంది, సబ్ ఓవర్సీర్ ట్రెయినీ(సివిల్) పోస్టుకు 2028 మంది, మేనేజ్మెంట్ ట్రెయినీ మైనింగ్ పోస్టుకు 3826 మంది, మేనేజ్మెంట్ ట్రెయినీ(పర్సనల్) పోస్టుకు 1146 మంది హాజరయ్యారు. సింగరేణి పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించడంపై అభ్యర్థులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement