తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తమ పాల ధరలను పెంచినట్లు వెల్లడించింది. రెండు సంవత్సరాల తరువాత ఈ పెంపునకు ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో పాటుగా ముడి సరుకుల ధరలు పెరగడం కారణంగా తెలిపింది. పెంచిన ఈ ధరలతో ఆవు పాలు ధర 2 రూపాయలు పెరగ్గా, గేదె పాలు మూడు రూపాయలు, స్కిమ్డ్ పాలు మూడు రూపాయల ధర పెరిగింది. పెంచిన ఈ థరలతో 500మిల్లీ లీటర్ల ఆవు పాలు ఇప్పుడు 40 రూపాయలకు, గేదె పాలు 48 రూపాయలకు లభిస్తే, స్కిమ్డ్ పాలు 30 రూపాయలకు లభిస్తాయి. ఈసందర్భంగా సిద్స్ ఫార్మ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాలుగా ముడి పాల ధరలు 15శాతంకు పైగా పెరిగాయన్నారు. ఇంధన ధరలు 45 శాతం, ద్రవ్యోల్బణ ప్రభావంతో మేత, ప్రింటింగ్ ఇంక్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయన్నారు. ఇవన్నీ కలిసి మొత్తంమ్మీద ఇన్‌ఫుట్ ధరలు పెంచాయన్నారు. దాంతో తప్పనిసరై పాల ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement