తెలంగాణా కేంద్రంగా కలిగిన ప్రీమియం డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ ప్రతిభావంతుల నియామకాలను వేగవంతం చేసింది. ఈ ఫార్మ్ ఇప్పుడు హైదరాబాద్‌లో 23వేల లీటర్ల పాలను సరఫరా చేస్తుండగా, త్వరలోనే బెంగళూరుతో పాటుగా ఇతర నగరాల్లో కూడా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం తమకున్న 300కు పైగాస్టోర్లను 1500కు పైగా వృద్ధి చేయాలని లక్ష్యంగా చేసుకున్న వేళ ప్రతిభావంతుల నియామకంపై దృష్టి సారించింది.
ఈసందర్భంగా ఐఐటీ ఖరగ్‌పూర్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ మస్సాచుసెట్స్ పూర్వ విద్యార్థి, సిద్స్ ఫార్మ్ ఎండీ డాక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ… నాణ్యమైన పాల ఉత్పత్తుల పట్ల అవగాహన కల్పించాలనే తమ ప్రయత్నం విజయవంతమైందన్నారు. ఇప్పుడు పాల పరిశ్రమలో నూతన ప్రమాణాలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకోసం అత్యున్నత ప్రతిభావంతుల నియామకం చేపట్టాలనుకుంటున్నామన్నారు. వీరే తమ సంస్థను తరువాత దశకు తీసుకువెళ్లగలరని అన్నారు.తమ నియామకాలలో భాగంగా సిద్స్ ఫార్మ్ ఇప్పుడు ఆరుగురు లీడర్లను మార్కెటింగ్, మానవ వనరులు, బ్రాండ్ అవగాహన పట్ల దృష్టి సారించిన మేనేజ్మెంట్, మార్కెట్ విస్తరణ, భవిష్యత్ వృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించి నియమించిందన్నారు. వీరిలో దివ్యదీప్ లొల్ల, ఏవీపీ ఆపరేషన్స్‌గా నియమితులు కాగా, ఏవీపీ ఫైనాన్స్‌గా శ్రీ హర్ష వడకట్టు, ఏవీపీ సేల్స్‌గా రాజేష్ డేగల, హెచ్ జీఎంగా సుజాత రామకోటి , ఏవీపీ మార్కెటింగ్ హెడ్‌గా తమల్ ఛటర్జీ, ఏవీపీ సేల్స్‌గా గోపి కృష్ణ దారపురాపు ఉన్నారని తెలిపారు. తమ నాయకత్వ బృందం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, కల్తీ లేని పాలు, పాల ఉత్పత్తులను అందరికీ అందించగలదని కిశోర్ ఇందుకూరి అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..