హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ప్రీమియం డెయిరీ బ్రాండ్ అయిన సిద్స్ ఫార్మ్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (ఈఎస్ సీఏపీ ) ప్రతిష్టాత్మకమైన ఇన్‌క్లూజివ్ బిజినెస్ ప్రోగ్రామ్‌లో పాల్గొనటానికి ఎంపికైనట్లు ప్రకటించింది. ఎకోసియేట్, ఎండెవా (కోచ్), సిద్స్ ఫార్మ్ (కోచీ) మధ్య అవగాహన ఒప్పందం సంతకం చేయడంతో ఈ మైలురాయి చేరుకుంది.
ఈసందర్భంగా ఎకోసియేట్ వద్ద సస్టైనబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ సంతోష్ గుప్తా మాట్లాడుతూ… సిద్స్ ఫార్మ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నామన్నారు. సమ్మిళిత వ్యాపారం పట్ల వారి నిబద్ధత తమ సహకారంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందన్నారు. కలిసికట్టుగా మనం భారతదేశంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతుల రంగంలో శాశ్వతమైన మార్పులను తీసుకురాగలమన్నారు.
సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కిషోర్ ఇందుకూరి మాట్లాడుతూ… ఈ అవకాశం లభించడం తమకు ఒక గౌరవమన్నారు. నిరంతరం పెరుగుతున్న తమ రైతుల నెట్‌వర్క్‌లో నైతిక, స్థిరమైన పాడి వ్యవసాయ పద్ధతులను రూపొందించడానికి తాము సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన ఈఎస్ సీఏపీ ప్రోగ్రామ్‌కు ఎంపికైన కొద్దిమందిలో ఉండటం సంతోషంగా వుందన్నారు.