Friday, November 8, 2024

మంత్రి కేటీఆర్ నుండి ఎఫ్‌టిసిసిఐ అవార్డు అందుకున్న శివ్ నారాయణ్ జ్యువెలర్స్

హైద‌రాబాద్, జులై 5 (ప్ర‌భ న్యూస్) : హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన ఆభరణాల సంస్థ, శివ్ నారాయణ్ జ్యువెలర్స్‌ను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టిసిసిఐ) ఎక్స్‌లెన్స్ ఇన్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ అవార్డుతో సత్కరించింది. శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రదర్శించిన అసాధారణమైన హస్తకళ, సృజనాత్మక నైపుణ్యాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని మంత్రి కె.టి.రామారావు అందజేశారు. మూడు సంవత్సరాల క్రితం, శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రపంచాన్ని ఆకర్షించే నాలుగు దిగ్గజ కళాఖండాలను రూపొందించడానికి అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆధునిక సాంకేతికత, పురాతన పద్ధతుల ఖచ్చితమైన సమ్మేళనంతో చక్కగా రూపొందించబడిన ఈ అసాధారణమైన క్రియేషన్స్ లో గణేష్ లాకెట్టు, రామ్ దర్బార్ లాకెట్టు, ది సట్లడ (ఏడు-పొర) నెక్లెస్, భూతద్దం ఉన్నాయి. శివ్ నారాయణ్ జ్యువెలర్స్‌ అసాధారణ విజయాలను సాధించింది. వారు ఇప్పుడు 8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిళ్లను సంపాదించిన ఏకైక భారతీయ ఆభరణాల వ్యాపారిగా గుర్తింపు సాధించారు.

ఈసంద‌ర్భంగా శివ్ నారాయ‌ణ్ జ్యువెల‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ తుషార్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ… ఈ విశిష్ట ఆభరణాలతో ఎఫ్‌టిసిసిఐ, మంత్రి కె.టి.రామారావు నుండి గుర్తింపు పొందడంను గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ గుర్తింపు త‌మకు ఎనలేని గౌరవాన్నిస్తుందన్నారు. తాము జాతీయ వేదికపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తామన్నారు. త‌మ‌ మహోన్నత నైపుణ్యమూ ప్రదర్శిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఒక అద్భుతమైన అదృష్టమ‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement