హైదరాబాద్ : నాణ్యమైన అంతర్జాతీయ ఉన్నత విద్యను పొందడంలో లభ్యత, స్థోమత అనేవి భారతీయ విద్యార్థులను వేధిస్తున్న రెండు ప్రధాన సవాళ్లు. ఈ ఉన్నత విద్యకు షిఫ్టెడ్ తోడ్పడుతుంది. విదేశాలలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరగడంతో, ఇది సరికాని ఎంపికలకు కూడా దారితీస్తుంది. తప్పుడు సమాచారం, మోసపూరిత ఏజెంట్లు విద్యార్థుల కుటుంబ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం తీసుకురావటంతో పాటుగా వారి భవిష్యత్తు అవకాశాలను సైతం అడ్డుకుంటున్నారు. యూఎస్‌లో కూడా కార్యాలయాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన సంస్థ, గ్రాడ్‌రైట్, ఈ రంగంలో సమూల మార్పులను తీసుకువస్తుంది.
ప్రపంచంలోని మొట్టమొదటి ఎడ్ -ఫిన్ టెక్, ఏఐ-ఆధారిత సాస్ పర్యావరణ వ్యవస్థ అయిన గ్రాడ్‌రైట్, తమ గ్లోబల్ ఫస్ట్ వ్యాపార నమూనాతో, సంభావ్య విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు, రుణదాతలను సజావుగా ఒక వేదికపైకి తీసుకువస్తు షిఫ్టెడ్ 2023ని సమర్పిస్తుంది. ఇది ఉన్నత విద్యలో సంప్రదాయ సరిహద్దులను అధిగమించే ప్రత్యేక సమావేశం.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, విల్లమెట్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ కాలేజ్ పార్క్ వంటి యూనివర్శిటీల 30 ప్లస్ డీన్‌లు, అడ్మిషన్ డైరెక్టర్లు ఒకచోట చేరనున్నారు. ఎంపవర్, ప్రొడిజీ, ఎవన్స్, హెచ్ డీఎఫ్ సీ క్రెడిల, ఐసీఐసీఐ వంటి దేశీయ, అంతర్జాతీయ విద్యా రుణ ప్రదాతల సీఎక్స్ఓ లు, అశోక విశ్వవిద్యాలయం, ఐఐఐటీ హైదరాబాద్ వంటి ప్రముఖ భారతీయ సంస్థల డీన్లు, వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, భారతదేశం, విదేశాల నుండి నిపుణులు, ఆలోచనాపరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.