Friday, November 22, 2024

ఇండియా ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించిన సర్వీస్‌నౌ

హైదరాబాద్ : ప్రముఖ డిజిటల్ వర్క్‌ఫ్లో కంపెనీ, సర్వీస్‌నౌ కొత్త ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది భారతీయ సంస్థలకు డిజిటల్ ఇంక్యుబేషన్ హబ్ గా డిజిటల్ రోడ్‌మ్యాప్‌లైన జెన్ ఏఐ, హైపర్ ఆటోమేషన్, లో కోడ్ యాప్‌లు మోడల్ చేయడానికి, ప్రదర్శించడానికి, ఒత్తిడిని పరీక్షించడానికి తోడ్పడుతూనే కస్టమర్‌లు, ఉద్యోగులకు మెరుగైన అనుభవాన్ని అందించనుంది.

ఈ ప్రారంభ వేడుకలో తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఐఏఎస్ మాట్లాడుతూ…. హైదరాబాద్‌లోని సర్వీస్‌నౌ ఇన్నోవేషన్ సెంటర్ భారతీయ సంస్థలు పనిచేసే విధానాన్ని, డిజిటల్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవటంలో తోడ్పడటం పట్ల వారి నిబద్ధతను సూచిస్తుందన్నారు. ఈ పెట్టుబడి రాష్ట్రానికి, ప్రజలకు అవకాశాలను తీసుకురావడమే కాకుండా ప్రముఖ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్ ఖ్యాతిని పెంచుతుందన్నారు. సర్వీస్‌నౌ వృద్ధి కథలో భాగమైనందుకు తాము గర్విస్తున్నామన్నారు. డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను తీర్చిదిద్దే, భారతదేశం గ్లోబల్ డిజిటల్ పోటీతత్వాన్ని పెంచే ప్రపంచ స్థాయి ఆవిష్కరణల ఆవిర్భావానికి సాక్ష్యమివ్వడానికి తాము ఎదురుచూస్తున్నామన్నారు.

సర్వీస్‌నౌ ఇండియన్ సబ్-కాంటినెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమోలికా గుప్తా పెరెస్ మాట్లాడుతూ…. భారతదేశపు వ్యాపార సంస్థలకు పని చేయడానికి మెరుగైన మార్గాలను అందించడానికి, డిజిటల్ వ్యాపారాలను నిర్మించే విధానాన్ని సర్వీస్‌నౌ మారుస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం, త‌మ కస్టమర్‌లు యుఎస్ఏ వెలుపల ఉన్న సర్వీస్‌నౌ అతిపెద్ద డెవలప్‌మెంట్ సెంటర్‌లో త‌మ ఇంజనీర్‌లతో నేరుగా సంభాషణలు జరపడానికి వీలు కల్పిస్తుందన్నారు. సర్వీస్‌నౌ ఇండియా టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ మాట్లాడుతూ…. సర్వీస్ నౌ ఇండియా ఉద్యోగులు త‌మ ప్రపంచ శ్రామికశక్తిలో 15 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. డిజిటల్ నైపుణ్యాలతో ప్రజలను సన్నద్ధం చేయడానికి భారతదేశం విస్తృత పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం సర్వీస్‌నౌకి అత్యంత ప్రాధాన్యతగా ఉందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement