Tuesday, November 26, 2024

సెకండ్ ఇయర్‌ ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై మ‌ల్ల‌గుల్లాలు..

హైదరాబాద్‌, : వాయిదా పడ్డ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మళ్లి జరగడం దాదాపు కష్టంగానే కనబడు తోంది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను బట్టి చూసుకుంటే ఇదే విషయం స్పష్టమవుతున్నట్లు విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి. మే 1వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్‌ ఎగ్జామ్స్‌ కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విష యం తెలిసిందే. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను రద్దు చూస్తూ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకు న్నది. జూన్‌ మొదటి వారంలో సెకండ్‌ ఇయర్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రకటిం చింది. అయితే రాష్ట్రంలో కరోనా రోజురోజుకీ పెరుగుతుం డడంతో అసలు పరీక్షలు జరుగుతాయా? లేదా? అని విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. ఒకవేళ పరీక్షలు నిర్వ హించాలనుకుంటే పరీక్షల షెడ్యూల్‌ను కనీసం 15 రోజుల ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా కేసులు రాష్ట్రంలో విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు జరిగే అవకాశం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సాధా రణ పరిస్థితులు రావడానికి మరో రెండు నెలలు పట్టే అవ కాశం ఉన్నట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. అందు లోనూ ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయి టేజీ కూడా ఎత్తివేయడంతో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చనే వాదనలు విద్యావర్గాల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఇంటర్‌ బోర్డు అధికారులు ఇప్పటికే విధివిధానాలను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఎగ్జామ్స్‌ నిర్వహిస్తే ఒక వేళ వాటిని ఎప్పుడు నిర్వహించాలి? లేకుంటే ఇలాంటి సందర్భాల్లో ఇతర రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుబో తున్నాయనే విషయాలపై బోర్డు దృష్టి సారించినట్లు తెలిసింది. పరీక్షలు నిర్వహించడం మొత్తానికే కష్టమైతే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ వాళ్లకు మార్కులను ఏ విధంగా వేయాలనే దానిపై కూడా కసరత్తులు చేస్తున్నట్లు సమాచా రం. ఇప్పటికే సీబీఎస్‌ఈ సైతం 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణపై సీబీఎస్‌ఈ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూసి దానికనుగుణంగానే ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తుది నిర్ణయం అప్పుడే…
ఇంటర్‌ ఎగ్జామ్స్‌ అసలు నిర్వహించాలా? లేదా? అనే దానిపై జూన్‌ మొదటి వారంలో సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటాం. అప్పటి పరిస్థితుల దృష్ట్యా సెకండ్‌ ఇయర్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాలమేరకే తుది నిర్ణయం ఉంటుంది. అప్పటి వరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ఉత్తర్వుల్లో పేర్కొన్నాము. -సయ్యద్‌ జలీల్‌, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి

Advertisement

తాజా వార్తలు

Advertisement