Tuesday, November 26, 2024

Saudi : వెల్‌కమ్ టు అరేబియా ప్రచారాన్ని ప్రారంభించిన సౌదీ టూరిజం…

హైద‌రాబాద్ : సౌదీ జాతీయ పర్యాటక బ్రాండ్ సౌదీ వెల్‌కమ్ టు అరేబియా మరో వినూత్నమైన ప్రపంచ స్థాయి మార్కెటింగ్ ప్రచారాన్ని ఫుట్‌బాల్ లెజెండ్, సౌదీ టూరిజం ప్రచారకర్త, లియోనెల్ మెస్సీనితో ప్రారంభించింది. యూరప్, ఇండియా, చైనాలోని కీలకమైన మార్కెట్‌లలో ప్రారంభించబడిన, గో బియాండ్ వాట్ యు థింక్ ప్రచారంను వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రూపొందించబడినది. ఇది సౌదీ గురించి ఇప్పటికీ సాధారణ అపోహలు ఉన్నాయని వెల్లడించింది. సౌదీ అంతటాకనిపిస్తోన్న అద్భుతమైన, శక్తివంతమైన సాంస్కృతిక పరివర్తనను ఆస్వాదించటానికి పర్యాటకులను ఆహ్వానిస్తుంది.

సౌదీ గురించి తెలిసిన వారు టిక్‌టాక్, సోషల్ ఛానెల్‌లలో షేర్ యువ‌ర్ సౌదీ ద్వారా తమ సానుకూల అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకోమని ప్రోత్సహించబడ్డారు. తాజా సౌదీ వెల్‌కమ్ టు అరేబియా బ్రాండ్ ప్రచారం మూడు నెలల వ్యవధిలో యాక్టివేట్ చేయబడే టీవీ, సోషల్, డిజిటల్, ఓటీఏ వ్యూహాల కలయిక. ఈ ప్రచారం 2023 సెప్టెంబర్‌లో రియాద్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడిన యూఎన్ టూరిజం టూరిజం ఓపెన్స్ మైండ్స్ కార్యక్రమానికి ప్రాణం పోసింది. ఇది ప్రయాణీకులకు తమ పరిధులను విస్తరించడానికి, ప్రపంచంలోని నిర్దేశించని మూలలను అన్వేషించడానికి ఆహ్వానాన్ని అందిస్తుంది. ప్రభుత్వాలు, పరిశ్రమలకు ప్రత్యేక ప్రతిజ్ఞ అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement