Tuesday, November 26, 2024

సంక్రాంతి అంటేనే రైతుల పండుగ : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

పల్లెటూర్లలో సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని, రైతులు ఆరుగాలం కష్టించి, పండించిన పంట చేతికి వచ్చినప్పుడు చేసే పండుగ ఈ సంక్రాంతి పండుగ అని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్తా గుర్తు చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని నాగోల్ లో సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం వారి ఆధ్వర్యంలో ఆయ‌న‌ నివాసం దగ్గర కాలనీ వాసులు, కుటుంబ సభ్యులతో, బందు మిత్రులతో ఐవీఎఫ్ సభ్యులతో కలిసి, పల్లె టూర్లకు పోకుండా ఇక్కడే హైదరాబాద్ లోనే అందరూ ఒక్క దగ్గర చేరి, ఈరోజు భోగి పండుగ సందర్భంగా
చక్కగా ముగ్గులు వేసి గొబ్బెమ్మ లు అలంకరించారు. పసుపు కుంకుమలతో… ముత్యాల ముగ్గులతో… కళకళలాడే వాకిళ్ళలో.. హరిదాస్ సంకీర్తనలతో డూ..డూ.. బసవన్నతో వాయిద్య మేళ తాళాల మధ్య భోగి మంటలు పేర్చుతూ..భోగి మంటలు వేస్తూ.. సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. అనాదిగా వస్తున్న ఆచారం మన సంస్కృతి సంప్రదాయాలు మన పండుగలన్నారు. అలాంటి పండుగలు మన తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ.. ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ.. సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోవాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, సుభిక్షంగా ఉండాలని, రైతులు అంతా పాడి పంటలతో విలసిల్లాలని అందరూ ఆనందంగా వుండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్‌ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, ఐవీఎఫ్‌ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, ఐవీఎఫ్‌ స్టేట్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్య లక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా, సికింద్రాబాద్ జోన్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్, ఐవీఎఫ్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆలేటి రవి, ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు రెండు జంట నగరాలన్నీ విభాగాల సభ్యులు, ఐవీఎఫ్‌ మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement