సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరూ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇష్టపడతారు. కుటుంబ సభ్యుల మధ్య పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా పండుగకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగకు 4,233 బస్సులను నడపనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రధాన ప్రాంతాలకు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు సంక్రాంతి సెలవులు 13వ తేదీ నుంచి ఇవ్వడంతో 11వ తేదీ నుంచే ప్రత్యేక బస్సులు ప్రారంభం కానున్నాయి. 11వ తేదీన 200, 12వ తేదీన 500, 13వ తేదీన 700 స్పెషల్ బస్సులు నడపనున్నారు. 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనుంది. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్‌బీనగర్, ఆరాంఘర్, లింగంపల్లి, చందానగర్, ఇసీఐఎల్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, టెలిఫోన్ భవన్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్‌ల నుంచి నడుస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement