హైదరాబాద్ : అంతర్జాతీయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా, హై-టెక్నాలజీ సైనిక వ్యవస్థలు అండ్ ఉత్పత్తుల్లో కీలకమైన భారతీయ సంస్థ అయిన శామ్‌టెల్ అవినోయిస్ లిమిటెడ్ (ఎస్ఏ) ఉత్తర అమెరికాలో తన వ్యాపార అభివృద్ధి అండ్ మార్కెటింగ్ ప్రతినిధిగా జీఈఎం డిఫెన్స్ సొల్యూషన్స్ ఎల్ఎల్సీ ని నియమించినట్లు ప్రకటించింది. జీఈఎం డిఫెన్స్ సొల్యూషన్స్ ఎల్ఎల్ సీ ప్రెసిడెంట్ గ్రేడాన్ (గ్రేడీ) మైహ్రే, యూఎస్ఏ, కెనడాలో వివిధ వ్యాపార అభివృద్ధి, మార్కెటింగ్ కార్యకలాపాలలో శామ్‌టెల్ అవినోయిస్ కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ అభివృద్ధి అంతర్జాతీయ మార్కెట్లోకి ఎస్ఏ గణనీయమైన ముందడుగును సూచిస్తుంది.
మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ పునీత్ కౌరా మాట్లాడుతూ… గ్రేడీని తమతో కలిసినందుకు తాను చాలా సంతోషిస్తున్నానన్నారు. బీఏఈ సిస్టమ్స్, జీడీఎల్ఎస్, ఎల్3, హారిస్ మొదలైన వాటితో సహా యూఎస్ డిఫెన్స్‌లో అన్ని ప్రముఖ పేర్లను విస్తరించి ఉన్న తన గొప్ప అనుభవం నుండి శామ్‌టెల్ ప్రయోజనం పొందుతుందని తాను భావిస్తున్నానన్నారు. అతను తమ కంపెనీకి రక్షణ వ్యాపారంలో లోతైన జ్ఞానం, నైపుణ్యాన్ని తీసుకువచ్చారన్నారు. తమ కస్టమర్లకు అసాధారణమైన సేవ, విలువను అందించడంలో అతని ప్రయత్నాలు సహాయపడతాయని తాము విశ్వసిస్తున్నామన్నారు.