Friday, November 22, 2024

నూతన ఆవిష్కరణలకు శాంసంగ్‌ సాల్వ్‌ ఫర్‌ టుమారో .. హేమేష్‌ చదలవాడ

హైదరాబాద్‌ : యువతలో ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఆవిష్కరణల పోటీలను శాంసంగ్‌ సాల్వ్‌ ఫర్‌ టుమారో నిర్వహిస్తుందని టీమ్‌ ఆల్ఫా మానిటర్‌ హేమేష్‌ చదలవాడ తెలిపారు.

ప్రశ్న: సాల్వ్‌ ఫర్ టు మారో (భవిష్యత్తుకు పరిష్కారాలు) కార్యక్రమానికి సంబంధించి మీ అనుభవాన్ని కొంచెం వివరించండి?
హేమేష్‌: శాంసంగ్‌ సాల్వ్‌ ఫర్ టు మారో, ఒక వినూత్న ప్రయత్నం. యువతలో ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించేందుకు, మారుతున్న ఆలోచనలకు మద్దతు ఇచ్చేందుకు ఈ ఆవిష్కరణల పోటీ-లను నిర్వహించింది. భారతదేశంలోని ప్రజలు, సముదాయాలలో మార్పులు తీసుకువచ్చేందుకు 16-22 ఏళ్ల యువత ఈ పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. శాంసంగ్‌ సాల్వ్‌ ఫర్ టు మారో తన కలలను సాకారం చేసుకునేందుకు, తన నైపుణ్యాలను మెరుగు పర్చుకునేందుకు, చివరిగా తన నమూనాకు అవకాశం కల్పించింది. ఈ ఉత్పత్తిని అభివృద్ధి చేయడం ద్వారా తన కలలను వాస్తవంగా మార్చుకునే అవకాశాన్ని తనకు లభించిన గొప్ప అభ్యాస అనుభవం ఇది.

ప్రశ్న: మీ కంపెనీ పేరు ఏమిటి ? మీరు మీ ఉత్పత్తి గురించి మాకు కొంచెం చెప్పగలరా ?
హేమేష్‌: తన కంపెనీ పేరు థింకర్‌ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. తాము 2022లో సాల్వ్‌ ఫర్ టు మారో పోటీల్లో విజయం సాధించిన తర్వాత, శాంసంగ్‌, ఎఫ్‌ఐఐటి, ఐఐటి ఢిల్లీ తమపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. దీనితోనే తాను తన స్వంత కంపెనీని నమోదు చేసుకున్నాను. తమ వేరబుల్‌ పరికరం చిత్తవైకల్యం, అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న వృద్ధులను పర్యవేక్షించేందుకు, వారిని సంరక్షించేందుకు సహాయపడుతుంది. ఇది రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. వేరబుల్‌ బ్యాండ్‌, ఒక అలారాన్ని వెంట తీసుకెళ్లవచ్చు లేదా స్టేషన్‌లో ఉంచవచ్చు. దీన్ని వినియోగించడం చాలా సులభం. మీరు దానిని రోగిపై ఉంచండి. రోగి లేచి, నడవడం ప్రారంభించిన లేదా పడిపోయిన వెంటనే, సంరక్షకునికి లేదా కుటు-ంబ సభ్యునికి హెచ్చరిక ఆటోమేటిక్‌గా పంపిస్తుంది.

ప్రశ్న: మీరు శాంసంగ్‌ నుంచి అందుకున్న గ్రాంట్‌ గురించి మాకు చెప్పండి. మీరు నిధులను ఎలా ఉపయోగిస్తున్నారు?
హేమేశ్‌: సాల్వ్‌ ఫర్ టు మారో పోటీలో గెలిచిన తర్వాత తాను శాంసంగ్‌ నుంచి రూ.33 లక్షలు అందుకున్నాను. తాము ఉత్పత్తిని అభివృద్ధి చేయడం, దానిని ఆప్టిమైజ్‌ చేయడం, రోగులను సమర్ధవంతంగా పర్యవేక్షించే నమూనాలను రూపొందించడం కోసం చాలా నిధులను వినియోగిస్తున్నాము. రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ తనకు ఫోకస్‌ ఏరియా కనుక, తాను దీనిపై భారీగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాను.

- Advertisement -

ప్రశ్న: మీరు మీ పరికరానికి పే-టె-ంట్‌ ఫైల్‌ చేసారా?
హేమేష్‌: అవును, తమకు తాత్కాలిక పే-టె-ంట్‌ ఉంది. తుది పే-టె-ంట్‌ కోసం ప్రయత్నిస్తున్నాము. తాము వివిధ మెషీన్‌ లెర్నింగ్‌ మోడల్స్‌, లోరా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఉత్పత్తులతో పోల్చితే, ఈ రెండు అంశాలే తమ ఉత్పత్తిలో ప్రధాన అంశాలు. ఎఫ్‌ఐఐటి, ఐఐటి ఢిల్లీ, తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఫ్యాకల్టీ తమకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.

ప్రశ్న: మీ ఉత్పత్తి మార్కెట్‌కు సిద్ధంగా ఉందా ? మీరు ఎప్పుడు విడుదల చేయాలని యోచిస్తున్నారు ?
హేమేష్‌: ప్రస్తుతం తాము ఇంకా ప్రోటో టైపింగ్‌ దశలోనే ఉన్నాము. తన సన్నిహిత మిత్రుడు డిజైన్‌, 3డి మోడలింగ్‌లో తనకు సహాయం చేస్తున్నాడు. అదనంగా, శాంసంగ్‌ నిపుణులు, ఎఫ్‌ఐఐటి, ఐఐటి ఢిల్లీ నుంచి మద్దతు పొందుతున్నాను. తాను భారతదేశంలోని అతిపెద్ద నమూనా కేంద్రమైన టి వర్క్స్‌తో కూడా పనిచేస్తున్నాను. తాము ప్రస్తుతం పరికరాన్ని భారతదేశంలోని అతిపెద్ద డిమెన్షియా కేర్‌ సెంటర్‌లలో ఒక-టైన ఏఆర్‌డీఎస్‌ఐ (అల్జీమర్స్‌ అండ్‌ రిలే-టె-డ్‌ డిజార్డర్స్‌ సొసైటీ- ఆఫ్‌ ఇండియా)తో పరీక్షిస్తున్నాము. ఈ ఏడాది జూన్‌-జూలై నాటికి ఉత్పత్తిని ప్రజల చేతుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం.

ప్రశ్న: ఈ ఉత్పత్తిని తయారు చేయడం వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి?
హేమేష్‌: తన చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం వస్తువులను తయారు చేయడం తనకు చాలా ఇష్టం. తాను ఇప్పటి వరకు ప్రజలకు, సంఘాలకు సహాయం చేసేందుకే వాటిని తయారు చేశాను. అల్జీమర్స్‌తో బాధపడుతున్న తమ అమ్మమ్మను చూసిన తర్వాత తాను తన పరికరాన్ని తయారు చేసేందుకు ప్రేరణ పొందాను. తాను కొన్ని ప్రోటో టైప్‌లను తయారు చేసాను. కొన్ని కంపెనీలను సంప్రదించాను. చివరికి, సాల్వ్‌ ఫర్ టు మారో మద్దతు లభించింది. ఇది తన ఉత్పత్తిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో తనకు సహాయపడింది.

ప్రశ్న: మీ విద్యార్హత గురించి చెప్పండి. మీ ఉన్నత విద్య కోసం మీరు ఏమి చేయాలనుకుంటు-న్నారు?
హేమేష్‌: తాను ఇప్పుడే 12వ తరగతి ప్రారంభించాను. తన ఉన్నత విద్య కోసం, తాను ఎలక్ట్రానిక్స్‌, రోబోటిక్స్‌, ఏఐ, ఐఓటీ, ఫ్యూచర్ టెక్‌లలో పరిశోధన-ఆధారిత వృత్తిని కొనసాగించాలనుకుంటున్నాను. తాను వ్యవస్థాపక ఎకో-సిస్టమ్‌లోకి ప్రవేశించినప్పుడు, తాను తన విద్యను కోల్పోకూడదనుకుంటు-న్నాను. పైన పేర్కొన్న ఫీల్డ్‌లలో ఒకదానిలో గ్రాడ్యుయేట్‌ కావాలని అనుకుంటు-న్నాను.

ప్రశ్న: మీ కొనసాగుతున్న విద్యతో రేపటి కోసం పరిష్కారాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేసారు?
హేమేష్‌: శాంసంగ్‌ సాల్వ్‌ ఫర్ టు మారో తన ఎక్స్‌ట్రా కరిక్యులర్‌లను రూపొందించడంలో తనకు సహాయపడింది. తాను తన అధ్యయనాలను మరింతగా ప్లాన్‌ చేసుకోగలిగేలా చూసేందుకు ఇది తనకు ప్రొఫైల్‌, ఫీల్డ్‌ని ఇచ్చింది. తన పాఠశాల కూడా సాంసంగ్‌ నుంచి 10 లక్షల రూపాయల విలువైన స్మార్ట్‌ బోర్డ్‌ను అందుకుని, తన ప్రయత్నాలకు మద్దతునిచ్చింది. తన పాఠశాల తనకు 12వ తరగతికి స్కాలర్‌షిప్‌ను కూడా ఇచ్చింది. తాను గత సంవత్సరాల కన్నా మెరుగ్గా రాణిస్తున్నాను.

ప్రశ్న: సాల్వ్‌ ఫర్‌ టు-మారో భవిష్యత్తు పోటీదారుల కోసం మీ వద్ద ఏదైనా సలహా ఉందా ?
హేమేష్‌: ఒక్క సలహా అతిగా ఆలోచించకు. మీ హృదయానికి దగ్గరగా ఉన్న సమస్యను ఎంచుకోండి, మీరు మక్కువతో ఉన్నారు. మీరు కూల్‌గా భావించే, సమస్యను పరిష్కరించేందుకు, దానిలో శ్రేష్ఠమైనదాన్ని రూపొందించండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement