Friday, November 22, 2024

SAMSUNG: ఫిజిక్స్ వల్లాతో భాగస్వామ్యం చేసుకున్న శామ్‌సంగ్

హైదరాబాద్ : శామ్‌సంగ్ భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్. శామ్‌సంగ్ ఎడ్యుకేషన్ హబ్ ను ప్రారంభించింది. ఇది ఫిజిక్స్ వల్లా సహకారంతో టీవీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఎడ్యుకేషన్ యాప్. ఈ యాప్ 32 అంగుళాల నుండి 98 అంగుళాల స్క్రీన్ పరిమాణంలో ఉన్న అన్ని శామ్‌సంగ్ టీవీలలో అలాగే శామ్‌సంగ్ స్మార్ట్ మానిటర్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఈసంద‌ర్భంగా శామ్‌సంగ్ ఇండియా కన్స్యూమర్ ఎక్స్‌పీరియన్స్ టీమ్ హెడ్ దీపేష్ షా మాట్లాడుతూ..శామ్‌సంగ్ ఎడ్యుకేషన్ హబ్ యాప్‌తో తాము గృహాలలో టీవీ పాత్రను కేవలం వినోదానికి మించి విస్తరించాలని, ఆన్‌లైన్ అభ్యాసాన్ని పెద్ద స్క్రీన్‌పై సజావు అనుభవంగా మార్చాలని కోరుకుంటున్నామన్నారు. టీవీల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ఎడ్యుకేషన్ యాప్, 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు, పోటీ పరీక్షల కోసం ఆసక్తిని కలిగించే విద్యా అనుభవాన్ని అందించడం ద్వారా ఆన్‌లైన్ అభ్యాసాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి సిద్ధంగా ఉందన్నారు.

ఫిజిక్స్ వల్లా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ అభిషేక్ మిశ్రా మాట్లాడుతూ… ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు లేదా హైబ్రిడ్ మోడ్‌లతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావడమే త‌మ లక్ష్యమ‌న్నారు. ఈ భాగస్వామ్యం నాణ్యమైన కంటెంట్ పంపిణీని విస్తరించే దిశగా సాగుతుందన్నారు. ఇప్పుడు, విద్యార్ధులు తమ ఇళ్లలో, పెద్ద స్క్రీన్‌లపై మెరుగైన అభ్యాస అనుభవం నుండి ప్రయోజనం పొందవచ్చన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement