Tuesday, November 26, 2024

Samsung: గెలాక్సీ ఏ 55 5G, గెలాక్సీ ఏ35 5G విడుదల చేసిన శాంసంగ్

హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఈరోజు అద్భుతమైన ఆవిష్కరణలతో కూడిన గెలాక్సీ ఏ55 5G అండ్ గెలాక్సీ ఏ35 5Gలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. నూతన ఏ సిరీస్ మొబైల్ పరికరాలు గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ, ఏఐ ద్వారా మెరుగుపరచబడిన కెమెరా ఫీచర్‌లు, అనేక ఇతర కొత్త ఫీచర్‌లతో పాటు ట్యాంపర్-రెసిస్టెంట్ సెక్యూరిటీ సొల్యూషన్, శాంసంగ్ నాక్స్ వాల్ట్‌తో సహా బహుళ ప్రతిష్టాత్మక ఫీచర్స్ తో సహా మరెన్నో నూతన ఫీచర్స్ ను కలిగి ఉంటాయి.

” గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా గెలాక్సీ ఏ సిరీస్ నిలిచింది, ఇది భారతదేశ ఎంజెడ్ వినియోగదారుల నడుమ అపూర్వమైన ఆదరణను పొందింది. గెలాక్సీ ఏ55 5G & ఏ 35 5G విడుదల ప్రతిష్టాత్మక ఆవిష్కరణలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది. గెలాక్సీ ఏ55 5G & ఏ35 5G , 5G స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ మరియు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మిడ్-ప్రీమియం (రూ. 30,000-రూ. 50,000) సెగ్మెంట్‌లో మా నాయకత్వాన్ని ఏకీకృతం చేయడంలో మాకు సహాయపడతాయి” అని శాంసంగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్ ఘుఫ్రాన్ ఆలం అన్నారు.

ఫ్లాగ్‌షిప్ తరహా డిజైన్ అండ్ మన్నిక : మొదటి సారి, గెలాక్సీ ఏ55 5G ఒక మెటల్ ఫ్రేమ్‌ను పొందుతుంది అండ్ గెలాక్సీ ఏ35 5Gకి ప్రీమియం గ్లాస్ బ్యాక్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లు మూడు అధునాతన రంగులలో అందుబాటులో ఉన్నాయి – అవి ఆసమ్ లిలక్, ఆసమ్ ఐస్ బ్లూ అండ్ ఆసమ్ నేవీ లో లభిస్తాయి, ఐపి 67 రేట్ చేయబడ్డాయి, అంటే 1 మీటర్ మంచినీటిలో 30 నిమిషాల వరకు తట్టుకోగలవు. అవి దుమ్ము, ఇసుకను నిరోధించడానికి కూడా నిర్మించబడ్డాయి. 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే మరియు కనిష్టీకరించిన బెజెల్స్‌తో, 120Hz రిఫ్రెష్ రేట్ చాలా మృదువైన పనితీరును అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ముందు మరియు వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణతో వస్తాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement