Sunday, November 3, 2024

Samsung: వన్ యుఐ 6.1 అప్‌డేట్ తో మరిన్ని గెలాక్సీ పరికరాలకు తీసుకువస్తున్న శాంసంగ్

హైద‌రాబాద్ : మొబైల్ ఏఐ ప్రజాస్వామ్యీకరణను మరింతగా మెరుగు పరచడానికి రూపొందించిన నూతన వన్ యుఐ 6.1 అప్‌డేట్ ద్వారా మరిన్ని గెలాక్సీ పరికరాలలో గెలాక్సీ ఏఐ ఫీచర్ల లభ్యతను శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఈరోజు ప్రకటించింది. ఈ నవీకరణ గెలాక్సీ ఎస్ 23 సిరీస్, ఎస్ 23 ఎఫ్ఈ , జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ 5, టాబ్ ఎస్9 సిరీస్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది మార్చి చివరి నుండి అందుబాటులో ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌తో సమలేఖనం చేస్తూ, ఈ నవీకరణ ఆన్-డివైస్, క్లౌడ్-ఆధారిత ఏఐని మిళితం చేసే హైబ్రిడ్ విధానం ద్వారా వినియోగదారుల మొబైల్ ఏఐ అనుభవం ప్రమాణాన్ని పెంచుతుంది.

ఈ సందర్భంగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లో మొబైల్ ఎక్స్‌పీరియన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ టి ఎం రోహ్ మాట్లాడుతూ… గెలాక్సీ ఏఐతో తమ లక్ష్యం మొబైల్ ఏఐ కొత్త యుగానికి మార్గదర్శకత్వం వహించడమే కాకుండా, ఏఐని మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులను శక్తివంతం చేయడమన్నారు. ఇది గెలాక్సీ ఏఐ ప్రారంభం మాత్రమే, ఎందుకంటే తాము 2024లోపు 100 మిలియన్లకు పైగా గెలాక్సీ వినియోగదారులకు ఈ అనుభవాన్ని అందించాలని ప్రణాళిక చేస్తున్నామన్నారు. మొబైల్ ఏఐ అపరిమిత అవకాశాలను ఉపయోగించుకునే మార్గాలను ఆవిష్కరించడం కొనసాగిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement